సమర భేరికి సన్నాహకం | India A vs Australia: Hosts look to land telling blows in warm-up game | Sakshi
Sakshi News home page

సమర భేరికి సన్నాహకం

Published Thu, Feb 16 2017 11:41 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

సమర భేరికి సన్నాహకం

సమర భేరికి సన్నాహకం

నేటి నుంచి భారత్‌ ‘ఎ’తో ఆసీస్‌ వార్మప్‌ మ్యాచ్‌
తమ బలాన్ని పరీక్షించుకోనున్న స్మిత్‌ సేన
ముంబై:
భారత గడ్డపై ఈసారి ఎలాగైనా సిరీస్‌ దక్కించుకోవాలనే కసితో ఉన్న ఆస్ట్రేలియా జట్టు తమ సన్నాహకాలను ప్రారంభించనుంది. నేటి (శుక్రవారం) నుంచి భారత్‌ ‘ఎ’ జట్టుతో స్మిత్‌ సేన మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో తమ బల నిరూపణకు సిద్ధమవుతోంది. ఇక్కడ ఆడిన గత మూడు టెస్టు సిరీస్‌ల్లో ఆసీస్‌ జట్టును పరాజయాలే వెక్కిరించాయి. దీంతో ఈనెల 23 నుంచి జరిగే తొలి టెస్టు కోసం ఈ ఏకైక సన్నాహక మ్యాచ్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆ జట్టు భావి స్తోంది. జట్టు కూర్పుతో పాటు భారత ఉపఖండంలోని బలమైన స్పిన్  బౌలింగ్‌లో తమ స్థాయిని పరీక్షించుకునేందుకు ఇదే సరైన అవకాశం. మరోవైపు భారత జట్టు తమ రిజర్వ్‌ బెంచ్‌ సత్తా తెలుసుకునేందుకు ఎదురుచూస్తోంది.

ముఖ్యంగా వన్డే, టి20ల్లో అదు్భతంగా రాణిస్తున్న యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు ఈ మ్యాచ్‌ చక్కటి అవకాశంగా భావించవచ్చు. కెపె్టన్ గానూ బరిలోకి దిగుతున్న అతను ఇందులో రాణిస్తే తొలి రెండు టెస్టుల తుది జట్టులో ఉంచేందుకు కోచ్‌ అనిల్‌ కుంబ్లే, కెపె్టన్  విరాట్‌ కోహ్లి మొగ్గు చూపించవచ్చు. ఆస్ట్రేలియా లాంటి నాణ్యవైున బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు యువ ఓపెనర్‌ ప్రియాంక్‌ పాంచల్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. రంజీల్లో దుమ్ము దులిపిన అతను బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లోనూ సెంచరీతో అదరగొటా్టడు. జాతీయ జట్టులో రిజర్వ్‌ ఓపెనర్‌గా చోటు దక్కించుకోవాలంటే ఇది అతనికి మంచి అవకాశం.

కుర్రాళ్లకు భలే చాన్స్
దేశవాళీ టోర్నీల్లో సత్తా ప్రదర్శిస్తున్న యువ ఆటగాళ్లకు పేసర్లు జోష్‌ హాజెల్‌వుడ్, మిషెల్‌ స్టార్క్‌లతో పాటు లియోన్ , ఓ కీఫ్‌ లాంటి అంతర్జాతీయ స్థాయి స్పిన్నర్లను ఎదుర్కొనే అవకాశం ఈ మ్యాచ్‌ ద్వారా కలుగనుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ భారత్‌ ‘ఎ’ విశేషంగా రాణించింది. శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్, వికెట్‌ కీపర్‌ ఇషాన్  కిషన్ లపై సెలక్టర్లు కొంతకాలంగా దృష్టిసారించారు. తమ నిలకడైన ప్రదర్శనను మరోసారి కనబరచాలని ఈ యువ స్టార్‌ ఆటగాళ్లు భావిస్తున్నారు.

అయ్యర్‌ గత సీజన్ లో 1300లకు పైగా పరుగులు సాధించి ముంబైకి 41వ రంజీ టైటిల్‌ అందించినా ఈసారి మాత్రం ఆ జోరును ప్రదర్శించలేకపోయాడు. అటు గుజరాత్‌ ఓపెనర్‌ ప్రియాంక్‌ పాంచల్‌ అదే స్థాయిలో రాణించి ఈసారి తమ జట్టును తొలిసారి చాంపియన్ గా మార్చాడు. మిడిలార్డర్‌లో అంకిత్‌ బానే ఆడనున్నాడు. బౌలింగ్‌ విభాగంలో ఎడమ చేతి స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్, షాబాజ్‌ నదీంలతో పాటు మరో స్పిన్నర్‌ క్రిష్ణప్ప గౌతమ్‌ ఆసీస్‌ బ్యాట్స్‌మెన్ ను ఏమేరకు నియంత్రించగలరనేది ఆసక్తికరం. బెంగాలీ సీనియర్‌ అశోక్‌ దిండా, నవదీప్‌ సైనీ, హైదరాబాదీ మొహమ్మద్‌ సిరాజ్‌లతో పేస్‌ విభాగం కూడా బలంగా ఉంది.

స్పిన్నర్లపైనే దృష్టి
తొలి టెస్టుకు ముందు జరిగే సన్నాహక మ్యాచ్‌ కాబట్టి తుది జట్టు ఆటగాళ్లనే బరిలోకి దించా లా.. లేక కీలక పేసర్లకు విశ్రాంతి కల్పించాలా అనేది కోచ్‌ లీమన్  ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్టీవెన్ , డేవిడ్‌ వార్నర్, ఖాజా, హాండ్స్‌కోంబ్‌లతో బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగానే కనిపిస్తున్నా అతి ముఖ్యవైున స్పిన్ విభాగంపై ఆసీస్‌ మరింత దృష్టి పెట్టింది. నలుగురు ప్రధాన స్పిన్నర్లు నాథన్  లియోన్ , ఓ కీఫ్, ఆస్టన్  అగర్, స్వెప్సన్ కాంబినేషన్  కీలకం కానుంది. ఎందుకంటే వీరి రాణింపుపైనే మును్మందు జరిగే టెస్టు సిరీస్‌లో ఆసీస్‌ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

అలాగే  తొలిసారి భారత పర్యటనకు వచ్చిన రెన్ షా, స్వెప్సన్ , హ్యాండ్స్‌కోంబ్, అగర్, బర్డ్‌లకు ఇక్కడ పిచ్‌లు ఎలాంటి సవాల్‌ విసురుతాయో తెలుసుకునేందుకు ఈ మ్యాచ్‌ను చక్కటి అవకాశంగా వినియోగించుకోవచ్చు. ఏదేవైునా స్థానిక బ్రబౌర్న్‌ మైదానంలో జరిగే ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

ఇది మాకో మంచి అవకాశం...
సెలక్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తా
ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వ్యాఖ్య

ముంబై:
భారత వన్డే, టి20 జట్లలో రెగ్యులర్‌ సభ్యుడిగా మారినా... ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఇంకా టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టలేదు. ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం జట్టులోకి ఎంపికైనా, మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. అయితే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో సత్తా చాటి సెలక్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తానని అతను అన్నాడు. తనతో పాటు జట్టులో ఉన్న కుర్రాళ్లందరికీ ఇది మంచి అవకాశమని అతను వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ జట్టుకు పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ‘మా యువ ఆటగాళ్లందరికీ ఇదో మంచి అవకాశం.

నేను కూడా ఇక్కడ బాగా ఆడితే టెస్టు సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కుతుందని నమ్ముతున్నా. దీనిని మేము ప్రాక్టీస్‌ మ్యాచ్‌లా చూడటం లేదు. సెలక్టర్ల దృష్టిలో పడేందుకు ఇది సరైన వేదికగా భావిస్తున్నాం. దూకుడుకు మారుపేరైన ఆసీస్‌తో పోరు ఆసక్తికరంగా సాగవచ్చు’ అని పాండ్యా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తాను టెస్టు ఆటగాడిగా ఎదిగే క్రమంలో పలు విషయాలను మెరుగుపర్చుకునే ప్రయత్నంలో ఉన్నానని, తనకు కోహ్లి, కుంబ్లే కూడా అండగా నిలుస్తున్నారని పాండ్యా వెల్లడించాడు. భారత ‘ఎ’ జట్టు సభ్యుడిగా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌నుంచి అనేక అంశాలు నేర్చుకోగలిగానని పాండ్యా అన్నాడు.  

జట్లు...
భారత్‌ ‘ఎ’: హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్ ), అఖిల్‌ హెర్వాడ్కర్, ప్రియాంక్‌ పాంచల్, అయ్యర్, అంకిత్‌ బానే, రిషభ్‌ పంత్, ఇషాన్  కిషన్ , షాబాజ్‌ నదీమ్, క్రిష్ణప్ప గౌతమ్, కుల్దీప్‌ యాదవ్, నవ్‌దీప్‌ సైనీ, అశోక్‌ దిండా, మొహమ్మద్‌ సిరాజ్, రాహుల్‌ సింగ్, బాబా ఇంద్రజిత్‌.
ఆసీస్‌: స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్ ), వార్నర్, అగర్, జాక్సన్  బర్డ్, పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్, జోష్‌ హాజెల్‌వుడ్, ఉస్మాన్  ఖాజా, నాథన్ లియోన్ , మిషెల్‌ మార్ష్, షాన్ మార్ష్ మ్యాక్స్‌వెల్, ఓ కీఫ్, రెన్ షా, స్టార్క్, స్వెప్సన్ , వేడ్‌.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement