తడబడుతున్నారు | Shreyas Iyer slams unbeaten 85 off 93 vs Australia in practice match | Sakshi
Sakshi News home page

తడబడుతున్నారు

Published Sun, Feb 19 2017 12:57 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

తడబడుతున్నారు

తడబడుతున్నారు

► రాణించిన శ్రేయస్‌ అయ్యర్‌
► భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ 176/4 
► ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 469/7 డిక్లేర్డ్‌

ముంబై: ఆస్ట్రేలియా జట్టుకు గట్టి పోటీనిస్తారనుకున్న భారత యువ క్రికెటర్లు బౌలింగ్‌లో ఇప్పటికే తేలిపోగా... బ్యాటింగ్‌లోనూ తడబడుతున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ (93 బంతుల్లో 85 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒక్కడే పటిష్టవైున ఆసీస్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నాడు. దీంతో రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్‌ ‘ఎ’ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో నాలుగు వికెట్లకు 176 పరుగులు చేసింది. క్రీజులో అయ్యర్‌తో పాటు రిషభ్‌ పంత్‌ (3 బ్యాటింగ్‌) ఉన్నాడు. ఓపెనర్‌ ప్రియాంక్‌ పాంచల్‌ (62 బంతుల్లో 36; 5 ఫోర్లు), అంకిత్‌ బానే (48 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడారు.

ఆదివారం ఆటకు చివరి రోజు కాగా భారత్‌ ‘ఎ’ ఇంకా 293 పరుగులు వెనకబడి ఉంది. పేసర్‌ జాక్సన్  బర్డ్, స్పిన్నర్‌ లియోన్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. మరోవైపు కోహ్లి సేనతో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్ కు ఫుల్‌ ప్రాక్టీస్‌ లభించినట్టయి్యంది. మిషెల్‌ మార్ష్ (159 బంతుల్లో 75; 11 ఫోర్లు, 1 సిక్స్‌), మ్యాథ్యూ వేడ్‌ (89 బంతుల్లో 64; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌ను ఆసీస్‌ జట్టు 127 ఓవర్లలో 7 వికెట్లకు 469 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. సైనికి రెండు వికెట్లు దక్కాయి.

మార్ష్, వేడ్‌ దూకుడు
ఓవర్‌నైట్‌ స్కోరు 327/5తో రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్‌కు మిచెల్‌ మార్ష్,, వికెట్‌ కీపర్‌ వేడ్‌ కలిసి ఆరో వికెట్‌కు 129 పరుగుల అదు్భత భాగస్వామా్యన్ని అందించారు. తొలి రోజు కెపె్టన్  స్టీవ్‌ స్మిత్, షాన్  మార్ష్, శతకాలతో హోరెత్తించగా శనివారం మిషెల్‌ మార్ష్, వేడ్‌ల దూకుడు కొనసాగింది. భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వీరిద్దరు ధాటిగా బ్యాటింగ్‌ కొనసాగించారు. ఈ జోడిని విడదీసేందుకు బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.

అయితే 24.3 ఓవర్లపాటు నిలకడగా బ్యాటింగ్‌ చేసిన ఈ ద్వయాన్ని లంచ్‌ విరామానికి ముందు పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ అఖిల్‌ హెర్వాడ్కర్‌ విడదీశాడు. రిషభ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చిన వేడ్‌ వెనుదిరగడంతో ఆరో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే షాబాజ్‌ నదీమ్‌ బౌలింగ్‌లో మిడాఫ్‌లో క్యాచ్‌ ఇవ్వడంతో మిచెల్‌ మార్‌‡్ష అవుటయా్యడు. మ్యాక్స్‌వెల్‌ (25 బంతుల్లో 16 నాటౌట్‌), ఓ కీఫ్‌ (20 బంతుల్లో 8 నాటౌట్‌; 1 ఫోర్‌) క్రీజులో ఉండగా మరో 5.3 ఓవర్ల అనంతరం ఆసీస్‌ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

అయ్యర్‌ హవా
ఆసీస్‌ నాణ్యవైున బౌలింగ్‌ను ఎదుర్కొనే క్రమంలో భారత కుర్రాళ్లు ప్రారంభం నుంచే ఇబ్బంది ఎదుర్కొన్నారు. స్పిన్నర్‌ నాథన్  లియోన్  రిటర్న్‌ క్యాచ్‌తో 19 పరుగుల వద్ద ఓపెనర్‌ అఖిల్‌ హెర్వాడ్కర్‌ (4) పెవిలియన్ కు చేరాడు. ఈ దశలో మరో ఓపెనర్‌ ప్రియాంక్‌తో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. చాలా రోజులుగా జాతీయ జట్టులో స్థానం కోసం చూస్తున్న తను అందివచ్చిన అవకాశాన్ని అదు్భతంగా వినియోగించుకున్నాడు.

తానెదుర్కొన్న తొలి బంతినే అయ్యర్‌ లాంగ్‌ ఆన్ లో భారీ సిక్స్‌గా మలిచాడు. అటాకింగ్‌ బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డ అతను ఐదు సిక్సర్లు, ఏడు ఫోర్ల సహాయంతో బంతికో పరుగు చొప్పున సాధిస్తూ ఆసీస్‌ను వణికించాడు. 44 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన అతను లియోన్ , ఓ కీఫ్, బర్డ్‌ బౌలింగ్‌ను ఆడుకున్నాడు. ప్రియాంక్‌తో కలిసి రెండో వికెట్‌కు 44, అంకిత్‌ బానేతో కలిసి మూడో వికెట్‌కు 57, పాండ్యా (57 బంతుల్లో 19; 2 ఫోరు్ల)తో కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించిన అయ్యర్‌ జట్టు స్కోరును పెంచే ప్రయత్నంలో ఉన్నాడు.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) ఇషాన్‌ (బి) సైనీ 25; రెన్ షా (సి) ఇషాన్‌ (బి) సైనీ 11; స్మిత్‌ (రిటైర్డ్‌ అవుట్‌) 107; షాన్  మార్ష్ (రిటైర్డ్‌ అవుట్‌) 104; హ్యాండ్స్‌కోంబ్‌ (సి) పాంచల్‌ (బి) పాండ్యా 45; మిషెల్‌ మార్ష్ (సి) సబ్‌ ఇంద్రజిత్‌ (బి) నదీమ్‌ 75; వేడ్‌ (సి) పంత్‌ (బి) హెర్వాడ్కర్‌ 64; మ్యాక్స్‌వెల్‌ నాటౌట్‌ 16; ఓ కీఫ్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (127 ఓవర్లలో 7 వికెట్లకు) 469.
వికెట్ల పతనం: 1–33, 2–55, 3–211, 4–288, 5–305, 6–434, 7–454.
బౌలింగ్‌: దిండా 21.2–1–78–0; పాండ్యా 22–3–84–1; సైనీ 19.4–7–42–2; నదీమ్‌ 33–1–126–1; అఖిల్‌ హేర్వాడ్కర్‌ 15–0–64–1; శ్రేయస్‌ అయ్యర్‌ 12–0–57–0; ప్రియాంక్‌ 4–0–11–0.
భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌: హెర్వాడ్కర్‌ (సి అండ్‌ బి) లియోన్  4; ప్రియాంక్‌ (సి) హ్యాండ్స్‌కోంబ్‌ (బి) లియోన్  36; శ్రేయస్‌ బ్యాటింగ్‌ 85; బానే ఎల్బీడబ్లు్య (బి) బర్డ్‌ 25; పాండ్యా (సి) వేడ్‌ (బి) బర్డ్‌ 19; రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (51 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 176.
వికెట్ల పతనం: 1–19, 2–63, 3–120, 4–172.
బౌలింగ్‌: జాక్సన్‌ బర్డ్‌ 11–7–15–2; మిషెల్‌మార్ష్ 9–2–26–0; లియోన్  17–3–72–2; ఓ కీఫ్‌ 14–1–59–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement