దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ నిలకడగా ఆడుతోంది.
పోష్‌స్ట్రూమ్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ రెండో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రవి సమర్థ్ (77), శ్రేయస్ అయ్యర్ (56 బ్యాటింగ్) అర్ధ సెంచరీలు సాధించగా, సుదీప్ ఛటర్జీ (46) రాణించాడు. కెప్టెన్ కరుణ్ నాయర్ (1) విఫలమయ్యాడు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 258/5తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 322 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో షాబాజ్ నదీమ్ నాలుగు, నవదీప్ సైని 3 వికెట్లు పడగొట్టారు. భారత్ ప్రస్తుతం మరో 141 పరుగులు వెనుకబడి ఉంది.