
బెల్గామ్: ఓపెనర్లు ప్రియాంక్ పాంచల్ (261 బంతుల్లో 160; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిమన్యు ఈశ్వరన్ (250 బంతుల్లో 189 బ్యాటింగ్; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో శనివారం మొదలైన తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో వికెట్ నష్టానికి 376 పరుగులు సాధించింది. ప్రియాంక్, అభిమన్యు తొలి వికెట్‌కు ఏకంగా 352 పరుగులు జోడించడం విశేషం. విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో ప్రియాంక్ వికెట్ కీపర్ డిక్‌వెలాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం అభిమన్యుతో కలిసి జయంత్ యాదవ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment