ఆసీస్ ‘ఎ’కు భారీ ఆధిక్యం | Best Border-Gavaskar Trophy Tests: No.6 | Sakshi
Sakshi News home page

ఆసీస్ ‘ఎ’కు భారీ ఆధిక్యం

Published Sat, Sep 17 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

ఆసీస్ ‘ఎ’కు భారీ ఆధిక్యం

ఆసీస్ ‘ఎ’కు భారీ ఆధిక్యం

భారత్ ‘ఎ’తో అనధికారిక టెస్టు
బ్రిస్బేన్: భారత్ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ’ఎ’కు పట్టు చిక్కింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 5 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఫలితంగా ఆ జట్టుకు 150 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కార్ట్‌రైట్ (153 బంతుల్లో 99 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్), నిక్ మ్యాడిసన్ (114 బంతుల్లో 81; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), వెబ్‌స్టర్ (79) చెలరేగారు. శార్దుల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు  3 వికెట్లు తీశాడు. 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ ఆ తర్వాత కోలుకుంది. కార్ట్‌రైట్, వెబ్‌స్టర్ ఐదో వికెట్‌కు 152 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు మ్యాడిసన్, ప్యాటర్‌సన్ మూడో వికెట్‌కు 92 పరుగులు జత చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement