రెండో అనధికారిక టెస్టు డ్రా
సిరీస్ కోల్పోయిన భారత్ ‘ఎ’
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో అనధికారిక టెస్టు మ్యాచ్ చివరి రోజుకు వర్షం అడ్డుపడింది. మైదానం పూర్తిగా చిత్తడిగా మారడంతో నాలుగో రోజు ఆదివారం ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయింది. ఫలితంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగియగా భారత్ ‘ఎ’ 0-1తో సిరీస్‌ను కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో ఆసీస్ ‘ఎ’ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. మూడో రోజు ఆటలో భారత్ ‘ఎ’ తమ రెండో ఇన్నింగ్‌సలో 60 ఓవర్లలో నాలుగు వికెట్లకు 158 పరుగులు చేసింది. ఇన్నింగ్‌స పరాజయాన్ని తప్పించుకోవాలంటే ఇంకా 108 పరుగులు చేయాల్సి ఉండేది. అయితే వర్షం రూపంలో భారత్‌ను ఆదుకుంది. ఆసీస్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్‌సలో 124.1 ఓవర్లలో 435 పరుగులకు ఆలౌట్ అవగా భారత్ ‘ఎ’ జట్టు తమ తొలి ఇన్నింగ్‌సలో 169 పరుగులే చేయగలిగింది.
చివరి రోజు వర్షార్పణం
Published Mon, Sep 19 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
Advertisement