test draw
-
వైట్‌వాష్ నుంచి తప్పించుకున్న దక్షిణాఫ్రికా.. మూడో టెస్టు డ్రా
సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు డ్రా ముగిసింది. దీంతో ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ వైట్‌వాష్‌ను దక్షిణాఫ్రికా తప్పించుకోగలిగింది. కాగా ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఆసీస్ 2-0 తేడాతో మూడు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 475/4 వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా 195 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా 255 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో సౌతాఫ్రికాను ఆసీస్ పాలో ఆన్ ఆడించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాలో ఆన్ ఆడటం ప్రారంభించిన ప్రోటీస్ ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. దీంతో ఇరు జట్లు ఆఖరి టెస్టును డ్రాగా ముగించాయి. చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ఆటగాడిగా -
శ్రీలంక-వెస్టిండీస్ రెండో టెస్ట్ డ్రా
సెయింట్ లూసియా : శ్రీలంక-వెస్టీండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ డ్రాగా ముగిసింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టీండీస్ బ్యాట్స్‌మెన్‌కు ఆఖరి రోజు శ్రీలంక బౌలర్లు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (59 నాటౌట్; 172 బంతుల్లో 6 ఫోర్లు), హోప్ (39; 115 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్) జట్టును ఆదుకోవడంతో మ్యాచ్ డ్రా అయ్యింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి టెస్టులో విండీస్ 226 పరుగలు తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ విండీస్ ఐదు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి ఓటమి అంచుల్లోకి వెళ్లింది. కాగా, బ్రాత్‌వైట్ మాత్రం బాధ్యతాయుతంగా ఆడాడు. అయితే చివరి సెషన్లో వాతావరణం అనుకూలించక పోవటంతో అంపైర్లు ఆటను నిలిపివేసారు. మ్యాచ్ ముగిసే సయయానికి వెస్టిండీస్ ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులతో ఉంది. దాంతో మ్యాచ్ డ్రా అయ్యింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సత్తా చాటిన విండీస్ బౌలర్ గాబ్రియేల్ (13/121)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు శనివారం నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంక : తొలి ఇన్నింగ్స్ 253 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 342 ఆలౌట్ వెస్టిండీస్ : తొలి ఇన్నింగ్స్ 300 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 147/5 -
చివరి రోజు వర్షార్పణం
రెండో అనధికారిక టెస్టు డ్రా సిరీస్ కోల్పోయిన భారత్ ‘ఎ’ బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో అనధికారిక టెస్టు మ్యాచ్ చివరి రోజుకు వర్షం అడ్డుపడింది. మైదానం పూర్తిగా చిత్తడిగా మారడంతో నాలుగో రోజు ఆదివారం ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయింది. ఫలితంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగియగా భారత్ ‘ఎ’ 0-1తో సిరీస్‌ను కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో ఆసీస్ ‘ఎ’ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. మూడో రోజు ఆటలో భారత్ ‘ఎ’ తమ రెండో ఇన్నింగ్సలో 60 ఓవర్లలో నాలుగు వికెట్లకు 158 పరుగులు చేసింది. ఇన్నింగ్స పరాజయాన్ని తప్పించుకోవాలంటే ఇంకా 108 పరుగులు చేయాల్సి ఉండేది. అయితే వర్షం రూపంలో భారత్‌ను ఆదుకుంది. ఆసీస్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్సలో 124.1 ఓవర్లలో 435 పరుగులకు ఆలౌట్ అవగా భారత్ ‘ఎ’ జట్టు తమ తొలి ఇన్నింగ్సలో 169 పరుగులే చేయగలిగింది. -
ఆసీస్ ‘ఎ’తో మరో డ్రా
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో భారత్ ‘ఎ’ రెండో అనధికారిక టెస్టు కూడా డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో రాణించి భారీ స్కోరు సాధించిన భారత్.. చివరిరోజు బౌలింగ్‌లో విఫలమైంది. ఫలితంగా హ్యూజెస్ (141 బంతుల్లో 100 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీకి తోడు డూలన్ (91 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆసీస్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ఆఖరి రోజు పలుమార్లు వర్షం ఆటంకం కలిగించడంతో 50.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఈ మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో రెండు టెస్టుల ఈ సిరీస్ 0-0తో డ్రాగా ముగిసింది. సంక్షిప్త స్కోర్లు ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 423; భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 521; ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 202/0. -
బ్రాత్‌వైట్ సెంచరీ
షిమోగా: భారత్ ‘ఎ’-వెస్టిండీస్ ‘ఎ’ జట్ల మధ్య రెండో అనధికార టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఎలాగూ ఫలితం డ్రా అని తెలిసిన తర్వాత వెస్టిండీస్ ‘ఎ’ జట్టు ఏ మాత్రం ప్రయోగాలకు పోకుండా మ్యాచ్‌ను బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు ఉపయోగించుకుంది. ఓపెనర్ బ్రాత్‌వైట్ (247 బంతుల్లో 104; 15 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... దేవ్‌నారాయణ్ (142 బంతుల్లో 93; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) ఏడు పరుగుల తేడాతో శతకాన్ని కోల్పోయాడు. ఈ ఇద్దరి రాణింపుతో నాలుగో రోజు శనివారం వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భార్గవ్ భట్ రెండు వికెట్లు తీసుకోగా... జహీర్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 406 పరుగులు చేయగా... భారత్ 359 పరుగులకే పరిమితమైంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్టు గెలిచిన వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఆఖరి టెస్టు 9 నుంచి హుబ్లీలో జరుగుతుంది. -
‘డ్రా’ దిశగా రెండో టెస్టు
సాక్షి, విశాఖపట్నం: భారత్ ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు డ్రా దిశగా సాగుతోంది. భారత బ్యాట్స్‌మన్ మన్‌ప్రీత్ జునేజా (336 బంతుల్లో 178 బ్యాటింగ్; 19 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత సెంచరీతో జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అతనికి జగదీశ్ (200 బంతుల్లో 91; 9 ఫోర్లు), అభిషేక్ నాయర్ (55 బంతుల్లో 57; 8 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. ఫలితంగా బుధవారం మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 124 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. జునేజాతో పాటు ధావల్ కులకర్ణి (4) క్రీజ్‌లో ఉన్నాడు. మూడు వికెట్లు చేతిలో ఉన్న భారత్ ప్రస్తుతం మరో 29 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. గురువారం మ్యాచ్‌కు ఆఖరి రోజు.