బ్రాత్‌వైట్ సెంచరీ | India A vs West Indies A: 2nd unofficial Test ends in a draw after Kraigg Brathwaite's hundred | Sakshi
Sakshi News home page

బ్రాత్‌వైట్ సెంచరీ

Published Sun, Oct 6 2013 1:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

బ్రాత్‌వైట్ సెంచరీ

బ్రాత్‌వైట్ సెంచరీ

 షిమోగా: భారత్ ‘ఎ’-వెస్టిండీస్ ‘ఎ’ జట్ల మధ్య రెండో అనధికార టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఎలాగూ ఫలితం డ్రా అని తెలిసిన తర్వాత వెస్టిండీస్ ‘ఎ’ జట్టు ఏ మాత్రం ప్రయోగాలకు పోకుండా మ్యాచ్‌ను బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు ఉపయోగించుకుంది. ఓపెనర్ బ్రాత్‌వైట్ (247 బంతుల్లో 104; 15 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... దేవ్‌నారాయణ్ (142 బంతుల్లో 93; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) ఏడు పరుగుల తేడాతో శతకాన్ని కోల్పోయాడు.

 ఈ ఇద్దరి రాణింపుతో నాలుగో రోజు శనివారం వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భార్గవ్ భట్ రెండు వికెట్లు తీసుకోగా... జహీర్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 406 పరుగులు చేయగా... భారత్ 359 పరుగులకే పరిమితమైంది. మూడు మ్యాచ్‌ల  ఈ సిరీస్‌లో తొలి టెస్టు గెలిచిన వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఆఖరి టెస్టు 9 నుంచి హుబ్లీలో జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement