South Africa Hold On To Draw With Australia on Day Five of Third Test - Sakshi
Sakshi News home page

AUS vs SA: వైట్‌వాష్‌ నుంచి తప్పించుకున్న దక్షిణాఫ్రికా.. మూడో టెస్టు డ్రా

Published Sun, Jan 8 2023 3:20 PM | Last Updated on Sun, Jan 8 2023 3:40 PM

South Africa hold on to draw with Australia on day five of third Test - Sakshi

సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు డ్రా ముగిసింది. దీంతో ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ వైట్‌వాష్‌ను దక్షిణాఫ్రికా తప్పించుకోగలిగింది. కాగా ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఆసీస్‌ 2-0 తేడాతో మూడు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 475/4 వద్ద డిక్లేర్ చేసింది.

ఆసీస్‌  బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా 195 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా 255 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో సౌతాఫ్రికాను ఆసీస్ పాలో ఆన్ ఆడించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాలో ఆన్‌ ఆడటం ప్రారంభించిన ప్రోటీస్‌ ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది.  దీంతో ఇరు జట్లు ఆఖరి టెస్టును డ్రాగా ముగించాయి.
చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌.. తొలి భారత ఆటగాడిగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement