సెయింట్ లూసియా : శ్రీలంక-వెస్టీండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ డ్రాగా ముగిసింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టీండీస్ బ్యాట్స్‌మెన్‌కు ఆఖరి రోజు శ్రీలంక బౌలర్లు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (59 నాటౌట్; 172 బంతుల్లో 6 ఫోర్లు), హోప్ (39; 115 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్) జట్టును ఆదుకోవడంతో మ్యాచ్ డ్రా అయ్యింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి టెస్టులో విండీస్ 226 పరుగలు తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ విండీస్ ఐదు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి ఓటమి అంచుల్లోకి వెళ్లింది. కాగా, బ్రాత్‌వైట్ మాత్రం బాధ్యతాయుతంగా ఆడాడు. అయితే చివరి సెషన్‌లో వాతావరణం అనుకూలించక పోవటంతో అంపైర్లు ఆటను నిలిపివేసారు. మ్యాచ్ ముగిసే సయయానికి వెస్టిండీస్ ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులతో ఉంది. దాంతో మ్యాచ్ డ్రా అయ్యింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సత్తా చాటిన విండీస్ బౌలర్ గాబ్రియేల్ (13/121)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు శనివారం నుంచి ప్రారంభం కానుంది.
శ్రీలంక : తొలి ఇన్నింగ్స్ 253 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 342 ఆలౌట్
వెస్టిండీస్ : తొలి ఇన్నింగ్స్ 300 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 147/5
Comments
Please login to add a commentAdd a comment