బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో భారత్ ‘ఎ’ రెండో అనధికారిక టెస్టు కూడా డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో రాణించి భారీ స్కోరు సాధించిన భారత్.. చివరిరోజు బౌలింగ్‌లో విఫలమైంది.
ఫలితంగా హ్యూజెస్ (141 బంతుల్లో 100 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీకి తోడు డూలన్ (91 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆసీస్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ఆఖరి రోజు పలుమార్లు వర్షం ఆటంకం కలిగించడంతో 50.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఈ మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో రెండు టెస్టుల ఈ సిరీస్ 0-0తో డ్రాగా ముగిసింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 423; భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 521; ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 202/0.
ఆసీస్ ‘ఎ’తో మరో డ్రా
Published Thu, Jul 17 2014 1:09 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement
Advertisement