వాన్‌గరి: న్యూజిలాండ్ ‘ఎ’తో జరుగుతోన్న మూడో అనధికారిక నాలుగు రోజుల టెస్టులో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 248/4తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 75 పరుగులు జతచేసి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది.
శుబ్‌మన్ గిల్ (102 బంతుల్లో 62; 7 ఫోర్లు, సిక్స్) అర్ధ శతకం పూర్తి చేసుకోగా... విజయ్ శంకర్ (98 బంతుల్లో 71; 8 ఫోర్లు, సిక్స్) క్రితం రోజు స్కోరుకు 11 పరుగులు జోడించి ఔటయ్యాడు. చివర్లో కేఎస్ భరత్ (47 బంతుల్లో 47; 7 ఫోర్లు, సిక్స్) ధాటిగా ఆడటంతో టీమిండియా 300 పరుగుల మార్కును దాటింది. అనంతరం తొలి ఇన్నిం గ్స్ ప్రారంభించిన కివీస్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 121 పరుగులు చేసింది. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా... గౌతమ్‌కు ఓ వికెట్ దక్కింది.
భారత్ ‘ఎ’ 323
Published Sun, Dec 2 2018 12:55 AM | Last Updated on Sun, Dec 2 2018 12:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment