బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా ముందుగానే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు శుభారంభం లభించలేదు. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత్-ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ ఔటయ్యాడు.
ఏమైంది రాహుల్?
రాహుల్ తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ విఫలమయ్యాడు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో నిరాశపరచడంతో మిగిలిన రెండు టెస్టులకు రాహుల్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్ కూడా చోటు దక్కింది. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను అలవాటు పడేందుకు రాహుల్‌తో పాటు ధ్రువ్ జురెల్ ప్రధాన జట్టుకంటే ముందే ఆస్ట్రేలియాకు భారత జట్టు మేనెజ్‌మెంట్ పంపింది.
కానీ అక్కడ కూడా రాహుల్ తనకు దక్కిన అవకాశాన్ని అంది పుచ్చుకోలేకపోయాడు. నవంబర్ 22 నుంచి ఆసీస్‌తో జరిగే తొలి టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని జట్టు మేనెజ్‌మెంట్ భావిస్తోంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ ఓపెనర్‌గా దిగాడు. కానీ రాహుల్ మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "మరి నీవు మారావా రాహుల్, ఎక్కడికి వెళ్లినా అంతేనా? అంటూ ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
కష్టాల్లో భారత్..
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టు కేవలం 110 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆసీస్ మైఖల్ నీసర్ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బతీశాడు. అతడితో పాటు వెబ్‌స్టార్ రెండు, స్కాట్ బోలాండ్ ఒక్క పడగొట్టాడు. భారత బ్యాటర్లలో ధ్రువ్ జురెల్(52 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
చదవండి: BAN vs AFG: ఘజన్‌ఫర్ మాయాజాలం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్
Comments
Please login to add a commentAdd a comment