
న్యూఢిల్లీ: సచిన్‌ను చూసి బ్యాట్ పట్టడం, ధోనిని చూసి వికెట్ కీపర్ కావడం... క్రికెటే లోకమనుకుంటున్న టీనేజ్ క్రికెటర్ల సామాజిక వికాసానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు చేపట్టనుంది. భారత్ ‘ఎ’, అండర్–19 జట్లను విశేషంగా తీర్చిదిద్దుతున్న కోచ్ ద్రవిడ్ ఇటీవల కుర్రాళ్లలో క్రికెట్‌తో పాటు సామాజిక ప్రవర్తనను మెరుగు పరచాలని సూచించారు. వారి దైనందిన జీవన వికాసానికి, భవిష్యత్తుకు ఉపయోగపడేలా కుర్ర క్రికెటర్లకు ఒకేషనల్ ట్రెయినింగ్ ఇస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా... ద్రవిడ్ సూచనలకు మద్దతు తెలిపారు. అండర్–16 ఆటగాళ్లకు క్రికెట్ తప్ప మరే ధ్యాస ఉండటం లేదని అర్థమైందని, దీంతో బోర్డు వారి క్రికెట్, క్రికెటేతర భవిష్యత్తుకు బంగారుబాట పరిచేందుకు సిద్ధంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment