CK Khanna
-
జైట్లీ మృతికి బీసీసీఐ ప్రగాఢ సంతాపం
న్యూఢిల్లీ: క్రికెట్ పాలకుడిగా తనదైన ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతికి బీసీసీఐ సంతాపం ప్రకటించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, సుదీర్ఘ కాలం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా పనిచేసిన జైట్లీని సమర్ధుడైన పాలకుడిగా కొనియాడింది. జైట్లీ మృతి తనకు, దేశానికి తీరని లోటని బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా అన్నారు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో పలువురు స్థానిక క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగారు. వారిలో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, టీమిండియా ప్రస్తుత ఆటగాళ్లైన కెప్టెన్ కోహ్లి, ధావన్, ఇషాంత్ శర్మ తదితరులున్నారు. జెట్లీ తనకు పితృ సమానుడని గంభీర్ అభివర్ణించాడు. జైట్లీ మృతి కలచి వేసిందని దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. జైట్లీ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు విండీస్‌తో టెస్టులో నల్ల బ్యాడ్జీలు ధరించారు. -
హైదరాబాద్‌లో ప్లే ఆఫ్ మ్యాచ్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసేందుకు బీసీసీఐ క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నేడు సమావేశం కానుంది. సీఓఏ సభ్యులతో పాటు బోర్డు తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరి ఈ సమావేశంలో పాల్గొంటారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేయడంతో పాటు ఇతర విషయాలపై కూడా చర్చ జరగనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్లే ఆఫ్ మ్యాచ్‌ల (రెండు క్వాలిఫయర్ మ్యాచ్‌లు, ఎలిమినేటర్ మ్యా చ్) వేదికలుగా హైదరాబాద్, చెన్నై ఖరారయ్యే అవకాశం ఉంది. ముంబైలో ఫైనల్ నిర్వహించాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు బీసీసీఐ మ్యాచ్‌లకు టైటిల్ స్పాన్సర్‌గా పేటీఎం గడువు ముగిసిపోయింది. దాంతో కొత్త స్పాన్సర్ కోసం టెండర్లను కోరే అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. మహిళా క్రికెటర్లతో మినీ ఐపీఎల్ నిర్వహించడంపై కూడా చర్చ జరగవచ్చు. -
యువ క్రికెటర్లకు సామాజిక శిక్షణ
న్యూఢిల్లీ: సచిన్‌ను చూసి బ్యాట్ పట్టడం, ధోనిని చూసి వికెట్ కీపర్ కావడం... క్రికెటే లోకమనుకుంటున్న టీనేజ్ క్రికెటర్ల సామాజిక వికాసానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు చేపట్టనుంది. భారత్ ‘ఎ’, అండర్–19 జట్లను విశేషంగా తీర్చిదిద్దుతున్న కోచ్ ద్రవిడ్ ఇటీవల కుర్రాళ్లలో క్రికెట్‌తో పాటు సామాజిక ప్రవర్తనను మెరుగు పరచాలని సూచించారు. వారి దైనందిన జీవన వికాసానికి, భవిష్యత్తుకు ఉపయోగపడేలా కుర్ర క్రికెటర్లకు ఒకేషనల్ ట్రెయినింగ్ ఇస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా... ద్రవిడ్ సూచనలకు మద్దతు తెలిపారు. అండర్–16 ఆటగాళ్లకు క్రికెట్ తప్ప మరే ధ్యాస ఉండటం లేదని అర్థమైందని, దీంతో బోర్డు వారి క్రికెట్, క్రికెటేతర భవిష్యత్తుకు బంగారుబాట పరిచేందుకు సిద్ధంగా ఉందన్నారు. -
మనం కనీసం రూ.5 కోట్లు ఇవ్వాలి!
న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తరఫున కనీసం రూ. 5 కోట్లు విరాళం ఇవ్వాలని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్‌కు లేఖ రాశారు. ‘పుల్వామా ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇతర భారతీయులలాగే మేం కూడా చాలా బాధపడుతున్నాం. ఇందులో మృతి చెందిన వారి కుటుంబా లకు మా ప్రగాఢ సానుభూతి. వారి కోసం బీసీసీఐ తరఫున కనీసం రూ. 5 కోట్లు ఇవ్వాలని సీఓఏకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఆయన రాశారు. వివిధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా తమ వైపు నుంచి తగిన విరాళం అందించాలని తాను వ్యక్తిగత హోదాలో విజ్ఞప్తి చేయబోతున్నట్లు ఖన్నా వెల్లడించారు. పుల్వామా ఘటనకు సంతాపం ప్రకటిస్తూ ఈ నెల 24న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టి20కి ముందు రెండు నిమిషాల మౌనం పాటించాలని ఆయన కోరారు. -
రాహుల్, పాండ్యాలపై నిషేధం ఎత్తేయండి
న్యూఢిల్లీ: యువ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా... క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ)కి లేఖ రాశారు. టీవీ షోలో మహిళలను కించపర్చే వ్యాఖ్యలు చేసినందుకు ఈ క్రికెటర్లిద్దరూ టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్‌నకు నాలుగు నెలలే ఉన్నందున వీరికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని, వర్ధమాన ఆటగాళ్లైనందున ఓ అవకాశం ఇద్దామని ఖన్నా కోరారు. ‘వారు ఇప్పటికే బేషరతుగా క్షమాపణ కోరారు. విచారణ కొనసాగిస్తూనే, రాహుల్, పాండ్యాలను తక్షణమే జాతీయ జట్టులోకి తీసుకుని న్యూజిలాండ్ పంపాలని సీఓఏ, బీసీసీఐ అధికారులను కోరుతున్నా. ఆ ఇద్దరిది ముమ్మాటికీ తప్పే. అయినప్పటికీ చట్టాలను ఉల్లంఘించిన వారిగా చూడటం తప్పనేది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని లేఖలో ఖన్నా పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయంలో విచారణ కోసం అంబుడ్స్‌మన్‌ను నియమించేందుకు ఖన్నా... బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) నిర్వహించాలని కోరుతున్నారు. ఇదే అభిప్రాయంతో బోర్డు కోశాధికారి అనిరుధ్ ఛౌదరి సైతం ఖన్నాకు లేఖ రాశారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ద్వారా ఈ మేరకు అధికారాలున్నాయి. కానీ, ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లినందున తదుపరి ఏ చర్యలు తీసుకున్నా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. -
పాండ్యా, రాహుల్‌లపై నిషేధం ఎత్తేయండి : బీసీసీఐ ఛీఫ్
ముంబై : టీమిండియా యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లపై నిషేధం ఎత్తేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సుప్రీం కోర్టు నియమిత పరిపాలకుల కమిటీ (సీఓఏ)ని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం సీఓఏకు లేఖ రాశారు. పాండ్య, రాహుల్ వివాదంపై ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక జనరల్ సమావేశం జరపలేమని స్పష్టం చేశారు. ‘పాండ్యా, రాహుల్‌లు తప్పు చేశారు. ఇప్పటికే వారిపై నిషేధం విధించి ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా రప్పించాం. ఇద్దరు ఆటగాళ్లు వారి వ్యాఖ్యల పట్ల బేషరతు క్షమాపణలు చెప్పారు. కావున విచారణ పూర్తేయ్యే వరకు వారిపై నిషేధం ఎత్తేసి జట్టులోకి తీసుకోవాలి. అలాగే న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో ఆడించాలి’ అని సీకే ఖన్నా లేఖలో కోరారు. బీసీసీఐ నియమావళి ప్రకారం ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డు నియమించిన అంబుడ్స్‌మన్‌కే ఉంది. ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్‌మన్‌కే ఇవ్వాలి. అయితే ఇప్పటికిప్పుడు అంబుడ్స్‌మన్‌ను నియమించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంబుడ్స్‌మన్‌ను నియమించే అధికారం కేవలం బోర్డుకే ఉందని...అది ఎన్నికలు నిర్వహించి కార్యవర్గం ఏర్పడిన తర్వాత మాత్రమే సాధ్యమని బీసీసీఐ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాదించడంతో ఈ కేసును వాయిదా వేసింది. వారం రోజుల తర్వాత వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఆటగాళ్లపై సస్పెన్షన్ కొనసాగిచండం సరైందరి కాదని ఖన్నా అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఓఏ, బీసీసీఐ ఆఫీస్ బేరర్స్‌కు సైతం విజ్ఞప్తి చేశారు. పాండ్యా, రాహుల్‌లు మాట్లాడింది ముమ్మాటికి తప్పేనని, కానీ వారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ ముందు ఇద్దరి ఆటగాళ్లు ప్రాక్టీస్ అవసరమని, ఈ యువ ఆటగాళ్ల తప్పును క్షమించి ఓ అవకాశం ఇద్దామని కోరారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో పాండ్యా, రాహుల్ ఇద్దరు అశ్లీల రీతిలో మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ షోలో పాండ్యా మాట్లాడుతూ ‘అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిమంతుడ్ని కాదు. వాళ్లను అదోటైపుగా చూస్తా. క్లబ్‌లలో వారి ఒంపుసొంపులపై కైపుగా కన్నేస్తా. ఎవరైనా అమ్మాయిని శారీరకంగా కలిస్తే ‘ఆజ్ మై కర్ కే ఆయా’ (నేను ఈ రోజు ...ఆ పని చేసొచ్చా) అని తల్లిదండ్రులతో చెప్పేస్తా’ అని ఒళ్లు మరిచి వ్యాఖ్యానించాడు. -
బీసీసీఐ జోక్యం చేసుకోదు
ముంబై: క్రికెటర్ల వ్యక్తిగత, వైవాహిక విషయాల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకోదని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టం చేశారు. తనను కలిసిన పేసర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్‌కు ఇదే విషయాన్ని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. షమీ తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని ఇటీవల హసీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పలు కేసులు మోపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బోర్డు నుంచి కూడా ఒత్తిడి తేవాలని భావించిన ఆమె ఖన్నాను వ్యక్తిగతంగా కలిసింది. కానీ ఆయన మాత్రం వ్యక్తిగత వ్యవహారాల్లో బోర్డు ఎంతమాత్రం కలుగజేసుకోదని, కుటుంబ పరిధిలోనే సమస్యను పరిష్కరించుకోవాలని ఆమెకు సూచించినట్లు తెలిపారు. త్వరలో జరిగే ఐపీఎల్, అనంతరం జరిగే ఇంగ్లండ్ సిరీస్‌లో షమీ రాణించాలని ఆశిస్తున్నట్లు ఖన్నా తెలిపారు. -
‘ఈ విజయం చాలా గొప్పది.. మనవాళ్లు అదరగొట్టారు..’
టీమిండియా ఆరు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 4-1తో సొంతం చేసుకుంది. పోర్ట్‌ఎలిజబెత్‌లో మంగళవారం ఇండియా- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో వన్డేలో భారత్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంపై బీసీసీఐ తాత్కలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మన క్రికెటర్లను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విజయం చాలా గొప్పది అని అన్నారు. ‘ఇండియా సారథి విరాట్ కోహ్లి, మిగతా ఆటగాళ్లు అసాధారణమైన ప్రదర్శన కనబర్చారు. ఏ జట్టునైనా వారి స్వదేశలంలో ఓడించే సామర్ధ్యం ఇండియా జట్టుకు ఉందని ఈ విజయంతో నిరూపించారు. 25 సంవత్సరాల తర్వాత వారు భారత్‌కు సిరీస్ సాధించండం దేశానికి గర్వకారణం’ అని సీకే ఖన్నా ఇండియా క్రికెటర్లను కొనియాడారు. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. మొదట నుంచి విఫలం చెందిన రోహిత్ ఐదో వన్డేలో సెంచరీతో మెరిశాడు. రోహిత్‌ను(126 బంతుల్లో; 115 పరుగులు) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు వరించింది. వన్డే కెరీర్లో రోహిత్‌కు 17వ సెంచరీ. సౌతాఫ్రికా బౌలర్లలో ఇన్‌గిడి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. హషీం ఆమ్లా(71పరుగులు) ఒక్కడే పోరాడాడు. జట్టును విజయం వైపు నడిపిస్తున్న ఆమ్లాను పాండ్యా అద్భుత ఫీల్డింగ్‌తో రన్ అవుట్ చేశాడు. ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు 4 వికెట్లు, హర్ధిక్ పాండ్యాకు 2 వికెట్లు, చాహల్‌కు 2 వికెట్లు, బుమ్రాకు ఒక వికెట్ దక్కాయి. ఈ విజయంతో సిరీస్ సొంతం చేసుకున్న భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని పటిష్టం చేసుకుంది. -
'ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు'
న్యూఢిల్లీ:భారత క్రికెటర్లకు వార్షిక వేతనాలను పెంచే విషయంలో ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ తాత్కాలిక సెక్రటరీ సీకే ఖన్నా స్పష్టం చేశారు. ప్రస్తుతం క్రికెటర్ల శాలరీ పెంపు అంశం చర్చల పరిధిలో మాత్రమే ఉందని వెల్లడించారు. దీనిపై త్వరలో జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్‌జీఎమ్)లో చర్చించాల్సి ఉందన్నారు. 'క్రికెటర్ల శాలరీ పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నాం. దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. రాబోవు సమావేశాల్లో జీతాల పెంపుకు సంబంధించి స్పష్టత వస్తుంది. ఎస్‌జీఎమ్‌లో బీసీసీఐ ఫైనాన్స్ కమిటీతో చర్చించిన తరువాత మాత్రమే తుది నిర్ణయం ఉంటుంది' అని సీకే ఖన్నా తెలిపారు. ఇప్పటివరకూ బీసీసీఐ వార్షిక రెవెన్యూలో రూ. 180 కోట్లను క్రికెటర్లకు కేటాయిస్తుండగా, దానికి అదనంగా మరో రూ. 200 కోట్లను చేర్చాలని పరిపాలకుల కమిటీ(సీఓఏ) యోచిస్తోంది. తద్వారా క్రికెటర్లకు ఇప్పుడు తీసుకుని వార్షిక జీతం మీద రెట్టింపు చేయాలనేది సీఓఏ ఆలోచన. దీనిలో భాగంగా ఇటీవల ఢిల్లీలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ అనంతరం సీఓఏతో సమావేశమైన కోహ్లి, ఎంఎస్ ధోని, కోచ్ రవిశాస్త్రిలు ఆటగాళ్ల శాలరీ పెంపుపై చర్చించారు. దీనికి సుముఖత వ్యక్తం చేసిన పరిపాలకుల కమిటీ బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. ఒకవేళ ఇందుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి వార్షిక ఫీజు 100 శాతం పెరిగే అవకాశం ఉంది. -
కోహ్లి ప్రతిపాదనకు బీసీసీఐ ఓకే
న్యూఢిల్లీ : తీరిక లేని మ్యాచ్‌లతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందని, బిజీ షెడ్యూల్‌పై పునరాలోచించాలని ఇటీవల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ప్రతిపాదనను బీసీసీఐ పరిగణలోకి తీసుకుంది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా నేతృత్వంలో సోమవారం జరిగిన సమావేశంలో మ్యాచ్‌లు ఆడే రోజులను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్( ఎఫ్టీపీ) మ్యాచ్‌లు ఆడే రోజులను తగ్గించారు. 2019 నుంచి 2023 మధ్య 390 రోజులు ఆడాల్సి ఉండగా ఈ సంఖ్యను 306 రోజులకు తగ్గించారు. ఈ ప్రణాళికలో 2021 చాంపియన్స్ ట్రోఫీ, 2023 ప్రపంచకప్ మ్యాచ్‌లను లెక్కించలేదు. ఈ టోర్నీల్లో టీమిండియా ఆడే మ్యాచ్‌లను కలిపినా ఈ సంఖ్య 350కు మించదు. అయితే ప్రస్తుత ఎఫ్టీపీతో పోలిస్తే 2019-2023 ఎఫ్టీపీ ప్రకారం టీమిండియా మూడు రెట్లు ఎక్కువగా టీ20లు ఆడనుందని సమాచారం. ఈ మధ్యకాలంలో భారత్ 50 శాతం మ్యాచ్‌లను పెద్ద జట్లైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో ఆడింది. ఈ అన్ని జట్లతో లాంగ్ ఫార్మట్ సిరీస్‌లు ఎక్కువగా ఆడింది. దీంతో ఎక్కువ రోజులు ఆడాల్సి రావడంతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. వచ్చే ఎఫ్టీపీలో టెస్టు, వన్డేలను తగ్గిస్తే మ్యాచ్‌లు ఆడే రోజులు తగ్గుతాయని, అలాగే మ్యాచ్‌ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందని భావించిన బీసీసీఐ ప్రత్యామ్నాయంగా టీ20ల సంఖ్యను పెంచినట్లు తెలుస్తోంది. -
రాజస్థాన్ క్రికెట్ సంఘంపై నిషేదం ఎత్తివేత
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌పై కొనసాగుతున్న నిషేదాన్ని ఎత్తి వేసింది. సోమవారం జరిగిన బోర్డు ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా ప్రకటించారు. ఇక 2014లో రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీసీసీఐ రాజస్థాన్ క్రికెట్ సంఘంపై వేటు వేసింది. హైకోర్టు సూచనలతో ఈ ఏడాది జూన్‌లో మళ్లీ జరిగిన ఎన్నికల్లో లలిత్ మోదీ కుమారుడు రుచిర్ పై కాంగ్రెస్ నేత సీపీ జోషి ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక సుప్రీం నియమించిన బీసీసీఐ పరిపాలకుల కమిటీ రాజస్థాన్ బోర్డు ఏర్పాటు చేసిన అడహక్ కమిటీని రద్దు చేయడంతో నిషేదం ఎత్తివేయడానికి మార్గం సుగమమైంది. ఈ నిషేదంతో ఇప్పటి వరకు రాజస్థాన్‌లో ఎలాంటి అంతర్జాతీయ, దేశావాళి మ్యాచ్‌లను నిర్వహించలేదు. ఆఖరికి ఐపీఎల్ మ్యాచ్‌లను సైతం జైపూర్‌కు తరలించారు. -
రవిశాస్త్రికి సరైన ఆరంభం: సీకే ఖన్నా
న్యూఢిల్లీ: స్వదేశంలో శ్రీలంకను భారత్ మట్టికరిపించడంపై బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సీకే ఖన్నా స్పందించారు. టెస్టు సిరీస్‌లో టీమిండియా అద్భుతంగా ఆడిందని కితాబిచ్చారు. హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రికి ఇది మంచి ఆరంభమని అన్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కొహ్లీ మీడియాతో ముచ్చటించారు. టీంలోకి మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లను తీసుకోవడంపై క్లారిటీ ఇచ్చారు. గత సీజన్లో ఇరువురి పర్ఫార్మెన్స్ బాగుండటం వల్లే ఈ సిరీస్‌కు ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరూ తమ వల్ల టీంకు ఏదైనా లాభం చేకూరుతుందని అనుకునే బౌలర్లని అన్నారు. -
'2019 వన్డే ప్రపంచకప్ మనదే'
ముంబై: శ్రీలంకలో టీమిండియా టెస్ట్ సిరీస్ గెలవడం పట్ల బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా హర్షం వ్యక్తం చేశారు. రెండు టెస్ట్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, అశ్విన్ అత్యుత్తమ ఆటతీరు కనబరిచారని ప్రశంసించారు. పుజారాకు ఈ మ్యాచ్ మర్చిపోలేదని వ్యాఖ్యానించారు. భారత క్రికెట్ చరిత్రలో స్వర్ణయుగం మొదలైందని వ్యాఖ్యానించారు. 2019 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఆదివారం కొలంబోలో ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకను 53 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవశం చేసుకుంది. చివరి టెస్టులో ఆడకుండా రవీంద్ర జడేజాపై నిషేధం విధించడంపై అతడి సోదరి నైనా స్పందించారు. శ్రీలంక సిరీస్‌లో తన సోదరుడు బాగా ఆడాడని, ఐసీసీ నిర్ణయాన్ని శిరసావహిస్తాడని తెలిపారు. ఇక నుంచి మైదానంలో జాగ్రత్తగా ఉంటాడని అన్నారు.