న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో మరణించిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తరఫున కనీసం రూ. 5 కోట్లు విరాళం ఇవ్వాలని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్‌కు లేఖ రాశారు. ‘పుల్వామా ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇతర భారతీయులలాగే మేం కూడా చాలా బాధపడుతున్నాం.
ఇందులో మృతి చెందిన వారి కుటుంబా లకు మా ప్రగాఢ సానుభూతి. వారి కోసం బీసీసీఐ తరఫున కనీసం రూ. 5 కోట్లు ఇవ్వాలని సీఓఏకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఆయన రాశారు. వివిధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా తమ వైపు నుంచి తగిన విరాళం అందించాలని తాను వ్యక్తిగత హోదాలో విజ్ఞప్తి చేయబోతున్నట్లు ఖన్నా వెల్లడించారు. పుల్వామా ఘటనకు సంతాపం ప్రకటిస్తూ ఈ నెల 24న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టి20కి ముందు రెండు నిమిషాల మౌనం పాటించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment