money donation
-
Kamareddy: నా కూతురిని బతికించండి..
సాక్షి, హైదరాబాద్: చదువుల తల్లి అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. డబ్బుల్లేక ఆమె తల్లిదండ్రులు ఇల్లు, ఆటో అమ్మేసుకున్నారు. వైద్యం చేయించేందుకు డబ్బుల్లేక దాతల కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.. ప్రసుత్తం కామారెడ్డి జిల్లాకు చెందిన రుబినా ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఐసెట్‌లో ర్యాంకు సాధించిన రుబినా డెంగీ పాజిటివ్‌తో పాటు ప్లేట్లెట్స్ పూర్తిగా పడిపోయి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టుపోయి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె ఆపరేషన్ కోసం రూ.7లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పడంతో ఆటో డ్రైవర్ అయిన ఆమె తండ్రి దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. రుబినాకు ఆపరేషన్ అత్యవసరం మూడు రోజుల క్రితం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రుబినాను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు న్యూరో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని, ఇందుకు రూ.7లక్షల నుంచి రూ.8లక్షల వరకు ఖర్చు అవుతాయని చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ బిడ్డను బతికించాలని వేడుకుంటున్నారు. ఫోన్‌పే లేదా గూగుల్ పే 94931 06370, 97030 58557 యూసుఫ్(రుబినా తండ్రి), బ్యాంక్ అకౌంట్ నంబర్లు 758402010000266, ఐఎఫ్‌సీ కోడ్ –యూబీఐఎన్0575844, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
పెళ్లి: కానుకలొద్దు.. విరాళం ఇవ్వండి!
ఛండీఘర్ : ఇటీవల ఓ కుటుంబం పెళ్లి వేడుకల్లో తీసుకున్న నిర్ణయం పలువురికి స్పూర్తిధాయకంగా నిలుస్తోంది. పెళ్లికి వచ్చిన అతిథుల నుంచి అందే మొత్తాన్ని కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు అందించేందుకు ఆ కుటుంబం నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన చంఢిఘర్ నగరానికి 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న ముక్త్సర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఓ పంజాబీ కుటుంబం మంగళవారం పెళ్లి వేడుక నిర్వహించారు. అయితే వివాహానికి వచ్చిన అతిథులు బహుమతులకు బదులుగాడబ్బును అందజేయాలని కోరారు. అంతేగాక ఈ ఆలోచన వెనక అసలు కారణాన్ని వెల్లడించారు. వేడుకలో వచ్చిన డబ్బులను తాము ఉపయోగించకుండా.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు అందిస్తామని తెలిపింది. చదవండి: గృహ నిర్బంధంలో కేజ్రీవాల్: ఆప్ రైతుల ఆహారం, బట్టలు వంటి అత్యవసర వస్తువులను అందించేదుంకు ఉపయోగిస్తామన్నారు. ఈ మేరకు వీడియో ద్వారా బంధువులు, స్నేహితులకు విన్నపించారు. ఇందుకు పెళ్లి స్టేజ్ మీద విరాళ బాక్స్‌ను ఏర్పాటు చేశారు. కాగా కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారీ ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఇవి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని, వెంటనే వీటిని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం పలు మార్లు రైతు సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయయ్యాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు సాయత్రం రైతులతో ఆరోసారి సమావేశమై రైతులకు కొత్త చట్టాలపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేయనున్నారు. -
మరింత సాయం కోసం...
జియ్యమ్మవలస: అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారి తల్లి చికిత్సకు అవసరమైన సాయం కొంత మొత్తం ఇప్పటికే అందింది. కానీ ఆ మొత్తం సరిపోదని మరింత మొత్తం అవసరమని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు దాతల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి గ్రామానికి చెందిన పడాల శ్రీను, స్వాతి భోగాపురం సమీపంలోని కోళ్ల ఫారంలో పని చేస్తూ అక్కడే నివాసం ఉండేవారు. తమ 11 నెలల బాబు తన్వీర్‌కు అనారోగ్యం చేయడంతో గత నెల 31న బైక్‌పై విశాఖపట్నం ఆస్పత్రికి బైక్‌పై బయలుదేరి భోగాపురం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై శ్రీను(34) అక్కడికక్కడే మృతి చెందాడు. స్వాతి తలకు బలమైన గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్వాతిని విశాఖపట్నం అపోలో ఆస్పత్రికి తరలించగా ఇప్పటికే రెండుసార్లు శస్త్రచికిత్సలు చేశారు. స్వాతి చికిత్సకు సుమారు రూ.ఏడు లక్షలు ఖర్చవుతుందని అపోలో వైద్యులు తెలిపారు. బాధితురాలి గ్రామానికి చెందిన యువత సామాజిక మాధ్యమాల్లో చిన్నారి తల్లి చికిత్సకు సాయం అందించాలని దాతలను కోరారు. స్పందించిన దాతలు... సామాజిక మాధ్యమాల్లో స్వాతి పరిస్థితి చూసి చలించిన గరుగుబిల్లి మండలం రావివలస గ్రామానికి చెందిన నౌడు నాగరాజు(డీఏఓ, ధవళేశ్వరం) తన సహోద్యోగులు, స్నేహితులు, గ్రామస్తుల సహకారంతో రూ.లక్షా 40వేల 712లను విరాళాలను సేకరించారు. ఈ మొత్తాన్ని ఆయన కుటుంబ సభ్యులు గంట వెంకటనాయుడు, ముసలినాయుడు చేతుల మీదుగా స్వాతి తల్లిదండ్రులు రేవళ్ల సీతారాం, పద్మలకు అందజేశారు. పెదబుడ్డిడికి చెందిన కర్రి శ్రీనివాసరావు, రేవళ్ల శంకరరావు, మంతిని శ్రీను, తలచింతల తవిటిరాజు, కోట్ని రవి తదితరులు గ్రామస్తుల సహకారంతో సుమారు రూ.లక్షా 90వేలు సేకరించి కుటుంబ సభ్యులకు అందజేశారు. పలువురు దాతలు సుమారు రూ.70వేలు వితరణగా అందించారు. ఇప్పటి వరకు సుమారు రూ.4లక్షలు సమకూరింది. తమ కుమార్తె చికిత్సకు మరో రూ.3లక్షలు అవసరమవుతుందని తల్లిదండ్రులు వెల్లడించారు. రెక్కాడితేగాని పొట్ట నిండని తమ కుటుంబానికి దాతలు సాయం చేసి ఆదుకోవాలని దాతలు అకౌంట్ నంబరు 139600101008629, ఐఎఫ్ఎస్సీ : సీఓఆర్పీ 0001396, ఫోన్ పే నెంబరు 7893538534కు సాయం పంపాలని కోరారు. -
మనం కనీసం రూ.5 కోట్లు ఇవ్వాలి!
న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తరఫున కనీసం రూ. 5 కోట్లు విరాళం ఇవ్వాలని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్‌కు లేఖ రాశారు. ‘పుల్వామా ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇతర భారతీయులలాగే మేం కూడా చాలా బాధపడుతున్నాం. ఇందులో మృతి చెందిన వారి కుటుంబా లకు మా ప్రగాఢ సానుభూతి. వారి కోసం బీసీసీఐ తరఫున కనీసం రూ. 5 కోట్లు ఇవ్వాలని సీఓఏకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఆయన రాశారు. వివిధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా తమ వైపు నుంచి తగిన విరాళం అందించాలని తాను వ్యక్తిగత హోదాలో విజ్ఞప్తి చేయబోతున్నట్లు ఖన్నా వెల్లడించారు. పుల్వామా ఘటనకు సంతాపం ప్రకటిస్తూ ఈ నెల 24న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టి20కి ముందు రెండు నిమిషాల మౌనం పాటించాలని ఆయన కోరారు. -
అన్నదాన పథకానికి రూ.1,00,001 విరాళం
అన్నవరం : సత్యదేవుని నిత్య అన్నదానపథకానికి ఆలమూరు మండలం ముద్దుకూరుకు చెందిన రాయుడు పట్టాభిరామయ్య రూ.1,00,001 విరాళాన్ని ఈఓ కే నాగేశ్వరరావుకు సోమవారం అందజేశారు. ఈ విరాళం పై వచ్చే వడ్డీతో ఏటా నవంబర్ ఐదో తేదీన రాఘవేంద్ర రైస్ ఇండస్ట్రీస్ పేరున అన్నదానం చేయమని దాత కోరినట్టు ఈఓ తెలిపారు.