సాక్షి, హైదరాబాద్: చదువుల తల్లి అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. డబ్బుల్లేక ఆమె తల్లిదండ్రులు ఇల్లు, ఆటో అమ్మేసుకున్నారు. వైద్యం చేయించేందుకు డబ్బుల్లేక దాతల కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.. ప్రసుత్తం కామారెడ్డి జిల్లాకు చెందిన రుబినా ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలిచింది.
ఐసెట్‌లో ర్యాంకు సాధించిన రుబినా డెంగీ పాజిటివ్‌తో పాటు ప్లేట్‌లెట్స్ పూర్తిగా పడిపోయి బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టుపోయి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె ఆపరేషన్ కోసం రూ.7లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పడంతో ఆటో డ్రైవర్ అయిన ఆమె తండ్రి దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
రుబినాకు ఆపరేషన్ అత్యవసరం
మూడు రోజుల క్రితం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రుబినాను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు న్యూరో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని, ఇందుకు రూ.7లక్షల నుంచి రూ.8లక్షల వరకు ఖర్చు అవుతాయని చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ బిడ్డను బతికించాలని వేడుకుంటున్నారు. ఫోన్‌పే లేదా గూగుల్ పే 94931 06370, 97030 58557 యూసుఫ్(రుబినా తండ్రి), బ్యాంక్ అకౌంట్ నంబర్లు 758402010000266, ఐఎఫ్‌సీ కోడ్ –యూబీఐఎన్0575844, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Comments
Please login to add a commentAdd a comment