రవిశాస్త్రికి సరైన ఆరంభం: సీకే ఖన్నా
న్యూఢిల్లీ: స్వదేశంలో శ్రీలంకను భారత్ మట్టికరిపించడంపై బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సీకే ఖన్నా స్పందించారు. టెస్టు సిరీస్‌లో టీమిండియా అద్భుతంగా ఆడిందని కితాబిచ్చారు. హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రికి ఇది మంచి ఆరంభమని అన్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కొహ్లీ మీడియాతో ముచ్చటించారు.
టీంలోకి మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లను తీసుకోవడంపై క్లారిటీ ఇచ్చారు. గత సీజన్‌లో ఇరువురి పర్ఫార్మెన్స్ బాగుండటం వల్లే ఈ సిరీస్‌కు ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరూ తమ వల్ల టీంకు ఏదైనా లాభం చేకూరుతుందని అనుకునే బౌలర్లని అన్నారు.