శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టాండ్-ఇన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజన్‌లో సిడ్నీ సిక్సర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్మిత్.. ఆడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా స్మిత్ మోచేతికి గాయమైంది. దీంతో అతడు శ్రీలంక సిరీస్ కోసం దుబాయ్‌లో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరానికి ఆసీస్ జట్టుతో పాటు వెళ్లలేదు.
ఈ క్రమంలో అతడు శ్రీలంక పర్యటనకు దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ సోమవారం నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో ఈ ఆసీస్ సూపర్ స్టార్ పాసయ్యాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం అతడికి తిరిగి జట్టులో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో ఆస్ట్రేలియా ఇదే ఆఖరి సిరీస్ కావడం గమనార్హం. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న ఆసీస్.. తమ ఫైనల్ సిరీస్‌లో కూడా విజయ భేరి మ్రోగించాలని భావిస్తోంది.
ఇరు జట్ల మధ్య జనవరి 29 నుంచి ఈ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(Pat cummins) దూరమయ్యాడు. అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో ఈ సిరీస్ నుంచి కమ్మిన్స్ తప్పుకున్నాడు. అతడి స్దానంలో స్టీవ్ స్మిత్(Steve Smith ) జట్టు పగ్గాలు చేపట్టాడు.
అదే విధంగా ఈ సిరీస్‌కు ఆసీస్ సెలక్టర్లు యువ సంచలనం కూపర్ కొన్నోలీకి తొలిసారి పిలుపునిచ్చారు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పదేళ్ల తర్వాత బీజీటీని కంగారులు రిటైన్ చేసుకున్నారు.
లంకతో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్ఫీ , మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్
చదవండి: జడేజా స్ధానంలో అతడికి ఛాన్స్ ఇవ్వాల్సింది: ఆకాష్ చోప్రా
Comments
Please login to add a commentAdd a comment