ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక విజయం సాధించిన శ్రీలంక.. ఇప్పుడు మరో సవాల్‌కు సిద్దమైంది. తమ స్వదేశంలో న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో లంక తలపడనుంది. వరల్డ్‌టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 సైకిల్‌లో భాగంగా జరగనుంది.
ఈ సిరీస్‌లో తొలి టెస్టు బుధవారం(సెప్టెంబర్ 18) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ తుది జట్టులో స్పిన్నర్ రమేశ్ మెండిస్‌కు చోటు దక్కింది. అతడు లంక తరపున మళ్లీ ఏడాది తర్వాత ఆడుతున్నాడు.
మెండిస్ చివరిసారిగా జూలై 2023లో టెస్టు మ్యాచ్ ఆడాడు. కాగా శ్రీలంక తొలి టెస్టులో కేవలం ఇద్దరూ పేస్ బౌలర్లతో మాత్రమే ఆడనుంది. లహిరు కుమార, అసిత ఫెర్నాండో కొత్త బంతిని పంచుకోనున్నారు. ఇంగ్లండ్ సిరీస్‌లో దుమ్ములేపిన కమిందు మెండిస్, పాతుమ్ నిస్సాంకలు కూడా ఈ తుది జట్టులో ఉన్నారు.
తొలి టెస్టుకు శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్: దిముత్ కరుణరత్నే, పాతుమ్ నిస్సాంక, దినేష్ చండిమాల్, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్, రమేష్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండో.
చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు మరో బిగ్‌షాక్!?
Comments
Please login to add a commentAdd a comment