కివీస్ కు భారీ విజయం | New Zealand won by an innings and 117 runs | Sakshi
Sakshi News home page

కివీస్ కు భారీ విజయం

Published Sun, Jul 31 2016 6:11 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

కివీస్ కు భారీ విజయం - Sakshi

కివీస్ కు భారీ విజయం

బులవాయో:జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయం సాధించింది. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ ఆకట్టుకున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 117 పరుగులతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకు ఆలౌటైన జింబాబ్వే.. రెండో ఇన్నింగ్స్ లో 295 పరుగులకే చాపచుట్టేయడంతో కివీస్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.

 

నాల్గో రోజు ఆటలో భాగంగా 121/5 ఓవర్ నైట్ స్కోరు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే పోరాడినా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్(119) శతకంతో రాణించగా, అంతకుముందు ఎర్విన్(50) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు సాధించగా, సౌతీ, వాగ్నర్లకు తలో రెండు వికెట్లు లభించాయి. అంతకుముందు న్యూజిలాండ్ 576/6 వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆగస్టు ఆరవ తేదీన ఇదే స్టేడియంలో జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement