'2019 వన్డే ప్రపంచకప్‌ మనదే' | I foresee India as winners of 2019 World Cup: CK Khanna | Sakshi
Sakshi News home page

'2019 వన్డే ప్రపంచకప్‌ మనదే'

Published Sun, Aug 6 2017 8:17 PM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM

'2019 వన్డే ప్రపంచకప్‌ మనదే'

'2019 వన్డే ప్రపంచకప్‌ మనదే'

ముంబై: శ్రీలంకలో టీమిండియా టెస్ట్‌ సిరీస్‌ గెలవడం పట్ల బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా హర్షం వ్యక్తం చేశారు. రెండు టెస్ట్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, చతేశ్వర్‌ పుజారా, అశ్విన్‌ అత్యుత్తమ ఆటతీరు కనబరిచారని ప్రశంసించారు. పుజారాకు ఈ మ్యాచ్‌ మర్చిపోలేదని వ్యాఖ్యానించారు. భారత క్రికెట్‌ చరిత్రలో స్వర్ణయుగం మొదలైందని వ్యాఖ్యానించారు. 2019 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఆదివారం కొలంబోలో ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకను 53 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవశం చేసుకుంది.

చివరి టెస్టులో ఆడకుండా రవీంద్ర జడేజాపై నిషేధం విధించడంపై అతడి సోదరి నైనా స్పందించారు. శ్రీలంక సిరీస్‌లో తన సోదరుడు బాగా ఆడాడని, ఐసీసీ నిర్ణయాన్ని శిరసావహిస్తాడని తెలిపారు. ఇక నుంచి మైదానంలో జాగ్రత్తగా ఉంటాడని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement