ICC Test Rankings for All-Rounder: R Ashwin Jumps to No. 2 in All-Rounder List - Sakshi
Sakshi News home page

ICC Test Rankings: బౌలర్‌గా,ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన అశ్విన్‌.. నెం2..

Published Wed, Dec 8 2021 4:28 PM | Last Updated on Wed, Dec 8 2021 5:02 PM

ICC Test Rankings: R Ashwin moves up to the No2 spot among allrounders  rankings - Sakshi

R Ashwin moves up to the No.2 spot among allrounders: ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్ట్‌ ర్యాంకిగ్స్‌లో భారత ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఏకంగా 30స్ధానాలు ఎగబాకి 11వ స్ధానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరగిన రెండో టెస్ట్‌లో మయాంక్‌ వరుసగా 150, 62 పరుగులు సాధించాడు. అదేవిధంగా మరో ఓపెనర్‌ శుభమాన్‌ గిల్‌ 21 స్ధానాలు ఎగబాకి 45వ స్ధానానికి చేరుకున్నాడు. ఇక తొలి స్థానంలో 903 పాయింట్లతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ ఉన్నాడు.  ఆసీస్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ 891 పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌(879), మార్నస్‌ లబుషేన్‌(878) మూడు, నాలుగో స్ధానంలో కొనసాగుతున్నారు.

మార్నస్‌ లబుషేన్‌ రోహిత్‌ శర్మ(797 పాయింట్లు), విరాట్‌ కోహ్లి( 775 పాయింట్లు) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. ఇక బౌలింగ్‌ విభాగంలో  భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో స్థానానికి చేరుకున్నాడు. 908 పాయింట్లతో పాట్‌ కమ్మిన్స్‌ అగ్ర స్ధానంలో కొనసాగుతుండగా, 883 పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు.  న్యూజిలాండ్‌ స్సిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ 23 స్ధానాలు ఎగబాకి 38 వ స్ధానానికి చేరుకున్నాడు. భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి అజాజ్‌ పటేల్‌ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఆల్‌రౌండర్‌ విభాగంలో 382 పాయింట్లతో జాసన్‌ హోల్డర్‌ తొలి స్ధానంలో ఉండగా, అశ్విన్‌ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.

చదవండి: ఐసీసీ అవార్డు రేసులో వార్నర్, సౌథీ.. టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement