సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టును టీమిండియా నిలకడగా ఆరంభించింది. భారత ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లు ఆచితూచి బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. తొలి సెషన్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఒక వికెట్ కూడా కోల్పోకుండా లంచ్ విరామానికి వెళ్లిన టీమిండియా రెండో సెషన్‌లోనూ అదే జోరు కనబరుస్తుంది. ప్రస్తుతం 39 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 109 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ అర్థశతకం(56 పరుగులు బ్యాటింగ్), కేఎల్ రాహుల్ 43 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు.
చదవండి: Cheteswar Pujara: అప్పుడు 'గోల్డెన్' రనౌట్.. ఇప్పుడు 'గోల్డెన్' డక్
అయితే 36 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మార్కో జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ నాలుగో బంతి మయాంక్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ కీపర్ డికాక్ వైపు పడింది. అయితే డికాక్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నప్పటికి చేతిలో నుంచి జారిపోయింది. ఆ పక్కనే ఉన్న డీన్ ఎల్గర్‌కు అవకాశమున్నప్పటికి వదిలేయడంతో మయాంక్ తప్పించుకున్నాడు. ఆ తర్వాత మయాంక్ అర్థ శతకం సాధించి ప్రస్తుతం నిలకడగా ఆడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక వ్యక్తి తన ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ''లడ్డూలాంటి క్యాచ్‌ను వదిలేశారు.. ఫలితం అనుభవించండి'' అంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు.
#SAvsIND Quinton de Kock drops a regulation catch… #SouthAfrica #India pic.twitter.com/WszyWmDfz1
— 𝐅𝐚𝐢𝐳𝐞𝐥 𝐏𝐚𝐭𝐞𝐥 (@FaizelPatel143) December 26, 2021
Comments
Please login to add a commentAdd a comment