సౌతాఫ్రికాతో టీమిండియా టెస్టు సిరీస్ ఆడేందుకు రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.ఈసారి ఎలాగైనా ప్రొటీస్ గడ్డపై సిరీస్ గెలవాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా జట్టు తమ ప్రాక్టీస్‌లోనూ జోరు పెంచింది. డిసెంబర్ 26 నుంచి ఇరుజట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు మొదలుకానుంది. ఇక గాయంతో రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమవ్వడంతో కేఎల్ రాహుల్‌తో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. అంతేకాదు రోహిత్ గైర్హాజరీలో కోహ్లి కెప్టెన్సీలో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా విధులు నిర్వర్తించనున్నాడు.
చదవండి: Harbhajan Singh Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ స్పిన్నర్
ఈ సందర్భంగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు కలిసి బీసీసీఐ టీవీకి ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా మయాంక్ కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించి.. ''ఐపీఎల్‌తో పోలిస్తే టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా నిర్వర్తించడం అంటే బాధ్యతతో కూడుకున్నది.. మరి నీ గ్రే కలర్ హెయిర్‌తో ఎలా నిర్వర్తిస్తావు'' అంటూ ప్రశ్నించాడు.
దీనిపై కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. ''నా జీవితంలో మళ్లీ టెస్టు క్రికెట్ ఆడనేమోనని సరిగ్గా ఏడాది కిందట అనుకున్నా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారి టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయాను. దీనికి తోడూ టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అదనంగా అనిపిస్తున్నాయి. ఒక రకంగా సంతోషంగా ఉన్నప్పటికీ రోహిత్ భయ్యా గైర్హాజరీలో కోహ్లికి ఎలా ఉపయోగపడాలనేదానిపై కొంచెం ఆందోళన ఉంది. బ్యాట్స్‌మన్‌గా నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా.. అదే సమయంలో వైఎస్ కెప్టెన్‌గానూ నా బాధ్యతలను హుందాగా నిర్వహించేలా చూస్తా. ఐపీఎల్ కెప్టెన్సీ వేరు.. ఇక్కడి కెప్టెన్సీ వేరు. అది ప్రైవేట్ లీగ్.. దేశం తరపున ఆడేటప్పుడు జట్టుగా అందరం కలిసి ఆడుతాం. ఈ బాధ్యత ఎంతో గొప్పది'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: IND Vs SA: "ఈ సారి కూడా విజయం మాదే.. టీమిండియాకు ఓటమి తప్పదు"
Comments
Please login to add a commentAdd a comment