India vs Sri Lanka: శ్రీలంకతో జరిగే మూడో టీ20కు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. భారత టీ20 స్పెషలిస్ట్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా మూడో టీ20 దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అతడి స్ధానంలో మయాంక్ ఆగర్వాల్ తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో కిషన్ గాయపడిన సంగతి తెలిసిందే. లాహిరు కుమారా బౌలింగ్‌లో కిషన్ తలకు గాయమైంది. అయితే మ్యాచ్ అనంతరం హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా ఆసుపత్రికి తరలించారు. తలకు సిటీస్కాన్ నిర్వహించారు. దీనికి సబంధించిన రిపోర్టు ఆదివారం రానుంది.
ఈ క్రమంలో అఖరి టీ20కు కిషన్ దూరం కానున్నడానే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే గాయం కారణంగా కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రుత్‌రాజ్ గైక్వాడ్‌లు ఈ సిరీస్ దూరమయ్యారు. కాగా భారత్-శ్రీలంక మధ్య మూడో టీ20 ధర్మశాల వేదికగా ఆదివారం జరగనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచి వరుసగా మూడో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన ఉర్రూతలూగుతుండగా.. కనీసం అఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక భావిస్తోంది.
భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్.
Comments
Please login to add a commentAdd a comment