
Breadcrumb
IPL 2022: ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ
Published Sun, Mar 27 2022 7:02 PM | Last Updated on Sun, Mar 27 2022 11:28 PM

Live Updates
పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ లైవ్ అప్డేట్స్
ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ సాధించింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. శిఖర్ ధావన్ 43, బానుక రాజపక్స 43, మయాంక్ అగర్వాల్ 32 పరుగులతో రాణించగా.. ఆఖర్లో షారుక్ ఖాన్ 24 నాటౌట్, ఓడియన్ స్మిత్ 25 నాటౌట్ లాంచనాన్ని పూర్తి చేశారు. ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 2, ఆకాశ్ దీప్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు.
లియామ్ లివింగ్‌స్టోన్(19) ఔట్.. ఐదో వికెట్ డౌన్
ఆర్సీబీ ఫీల్డర్ అనూజ్ రావత్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన లివింగ్‌స్టోన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో పంజాబ్ 156 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. పంజాబ్ విజయానికి 30 బంతుల్లో 50 పరుగులు చేయాల్సి ఉంది.
వరుస ఓవర్లలో రెండు వికెట్లు.. పంజాబ్ స్కోరు 145/4
పంజాబ్ కింగ్స్ ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో బానుక రాజపక్స(43), రాజ్ భవా(0)లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 14 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ 9, షారుక్ ఖాన్ 1 పరుగుతో ఆడుతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్
మయాంక్ అగర్వాల్(32) రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. హసరంగా బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో షాబాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. ధావన్ 30, బానుక రజాపక్స 3 పరుగులతో ఆడుతున్నారు.
మయాంక్, ధావన్ దూకుడు.. 6 ఓవర్లలో 63/0
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(30), శిఖర్ ధావన్(23)లు దూకుడు కనబరుస్తున్నారు. ఈ ఇద్దరి మెరుపులతో పంజాబ్ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది.
4 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 42/0
206 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ దూకుడు ఆటతీరు కనబరుస్తోంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 22, ధావన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆఖర్లో దినేశ్ కార్తిక్ మెరుపులు.. ఆర్సీబీ భారీ స్కోరు
డుప్లెసిస్ విధ్వంసాన్ని దినేశ్ కార్తిక్ కొనసాగించాడు. ఫలితంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. డుప్లెసిస్ (57 బంతుల్లో 88, 3 ఫోర్లు, 7 సిక్సర్లు), కోహ్లి(29 బంతుల్లో 41, 2 సిక్సర్లు, ఒక ఫోర్), కార్తిక్( 14 బంతుల్లో 32, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దుమ్మురేపారు. ఆర్సీబీ బ్యాటింగ్‌కు పంజాబ్ కింగ్స్ బౌలర్లు భారీగా పరుగులిచ్చుకున్నారు. ఈ సీజన్లో 200 ప్లస్ స్కోరు కొట్టిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది.
డుప్లెసిస్(88) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 88 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో షారుక్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 17 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
డుప్లెసిస్, కోహ్లి జోరు.. భారీ స్కోరు దిశగా ఆర్సీబీ
ఐపీఎల్ 2022లో ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌లోనే దుమ్మురేపుతుంది. ముఖ్యంగా కొత్త కెప్టెన్ డుప్లెసిస్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. అతనికి తోడూ కోహ్లి కూడా తనదైన ఇన్నింగ్స్ ఆడుతుండడంతో స్కోరుబోర్డు పరుగులెత్తుతుంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 158 పరుగులు చేసింది. డుప్లెసిస్ 82, కోహ్లి 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన అనూజ్ రావత్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.
4 ఓవరల్లో ఆర్సీబీ స్కోరు 25/0
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. డుప్లెసిస్ 7, రావత్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీకి కొత్త కెప్టెన్ అయ్యాడు. అటు కేఎల్ రాహుల్ కూడా లక్నో సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా వెళ్లడంతో.. పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.
ఇక ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు జరగ్గా.. పంజాబ్ 15 సార్లు.. ఆర్సీబీ 13 సార్లు విజయం సాధించింది. చివరి ఐదు మ్యాచ్‌లు చూసుకుంటే పంజాబ్ మూడుసార్లు.. ఆర్సీబీ రెండు సార్లు గెలిచింది. ఇక 2021లో ఇరుజట్లు రెండుసార్లు తలపడగా.. ఆర్సీబీ, పంజాబ్ చెరొక విజయాన్ని సాధించాయి.
Related News By Category
Related News By Tags
-
IPL 2022: రెండు పాయింట్లు మాకు చాలా ముఖ్యం.. క్రెడిట్ వాళ్లదే: మయాంక్
IPL 2022- నవీ ముంబై: ఆదివారం ఐపీఎల్ పసందైన విందు ఇచ్చింది. 27 సిక్సర్లతో (బెంగళూరు 13, పంజాబ్ 14)... 413 పరుగులతో ( 205 + 208) రెట్టింపు వినోదాన్ని పంచింది. ఒక సిక్సర్ ఎక్కువ కొట్టిన పంజాబ్ ఐదు వి...
-
కెప్టెన్‌గా దంచికొట్టాడు.. అరుదైన ఫీట్ సాధించాడు
ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో(57 బంతుల్లో 88, 3 ఫోర్లు,...
-
IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. ఇందులోనైనా ఆర్సీబీ గెలుస్తుందా..?
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 25) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ...
-
ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న పంజాబ్ కింగ్స్ ..!
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం లీగ్ దశలోనే ముగిసిన సంగతి తెలిసిందే. నూతన సారథిగా బాధ్యతలు చేపట్టిన మయాంక్ అగర్వాల్ జట్టును నడిపించడంలో విఫలమ్యాడు. ఈ ఏడాది సీజన్లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 వి...
-
'కెప్టెన్సీ భారం మంచి బ్యాటర్‌ను చంపేసింది'
ఐపీఎల్ 2022 సీజన్ కొందరు టీమిండియా ఆటగాళ్లకు పూర్వ వైభవం తీసుకొస్తే.. మరికొందరికి మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి క్రికెటర్లు ఫామ్ కోల్పోయ...