టీమిండియా ఆటగాడు, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ రంజీ ట్రోఫీ-2024లో శతకంతో మెరిశాడు. బీహార్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్ మెరుపు సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న మయాంక్ 12 బౌండరీల సాయంతో 105 పరుగులు చేశాడు. మయాంక్‌కు జతగా మనీశ్ పాండే (56) కూడా రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
కర్ణాటక ఇన్నింగ్స్‌లో మయాంక్, మనీశ్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. బీహార్ బౌలర్లలో హిమాన్షు సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. సకీబ్ హుసేన్ రెండు, వైభవ్ సూర్యవంశీ ఓ వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు బీహార్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకు ఆలౌటైంది. షర్మన్ నిగ్రోద్ (60) అర్ద సెంచరీతో రాణించగా.. గనీ (13), బిపిన్ సౌరభ్ (31), ప్రతాప్ సింగ్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్ గోపాల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మొహిసిన్ ఖాన్ 3, విద్యాధర్ పాటిల్, విజయ్‌కుమార్ వైశాఖ్, వి కౌశిక్ తలో వికెట్ దక్కించుకున్నారు.
144 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బీహార్ నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (6), షర్మన్ నిగ్రోద్ (0) ఔట్ కాగా.. బాబుల్ కుమార్ (11), గనీ (9) క్రీజ్‌లో ఉన్నారు. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బీహార్ ఇంకా 117 పరుగులు వెనుకపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment