ముంబై: ‘నేను అనుష్కను కలవకపోతే.. ఈ రోజు ఇంత ఒపెన్‌గా, ధృడంగా ఉండేవాడిని కాదు. ఆమె నన్ను మంచి వ్యక్తిగా మార్చింది’ అంటూ జీవిత భాగస్వామిపై ప్రశంసలు కురిపిస్తున్నారు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. ఈ మార్పు తన క్రికెట్ కెరీర్‌తో పాటు జీవితానికి ఎంతో సాయం చేసిందన్నారు. భారత టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చేసిన ఇంటర్వ్యూలో అనుష్క శర్మ గురించి విరాట్ కోహ్లి మాట్లాడిన వీడియోను బీసీసీఐ మంగళవారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. విరాట్, బాలీవుడ్ నటి అనుష్క శర్మ 2017 డిసెంబర్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సందర్భం వచ్చిన ప్రతిసారి అనుష్కను ప్రశంసిస్తుంటారు కోహ్లి. తాజాగా మరోసారి అనుష్కను అభినందించారు. (అలా ఆ సమస్యను అధిగమించా: కోహ్లి)
‘ప్రస్తుతం ప్రతి అంశాన్ని నేను విభిన్న కోణాల్లోంచి చూడగల్గుతున్నానంటే అందుకు కారణం అనుష్కనే. ఇందుకు సంబంధించిన పూర్తి క్రెడిట్ ఆమెకే దక్కుతుంది. అనుష్క నా జీవిత భాగస్వామిగా రావడం నా అదృష్టం. మేం ఇద్దరం ఒకరి నుంచి ఒకరం చాలా నేర్చుకుంటాం. అనుష్క రాక ముందు నేను ఇంత ఒపెన్‌గా ఉండేవాడిని కాదు. ప్రాక్టికల్‌గా ఆలోచించేవాడిని కాదు. కొన్ని విషయాల్లో ఆమె నా ఆలోచన విధానాన్ని మార్చింది. నా మైండ్‌సెట్ కూడా మారింది. అంతకు ముందు కొన్ని విషయాలను పూర్తిగా అర్థం చేసుకునే వాడిని కాదు. అయితే చాలా విషయాలను విశాల దృక్పథంతో చూడాలని ఆమె నాకు అర్థమయ్యేలా చేసింది. సరైన రీతిలో ప్రజలకు ఉదాహరణగా ఉండడం, అన్ని విషయాలను అర్థం చేసుకోవడం.. వంటి అలవాట్లు నాకు అనుష్కతో ఉండడం వల్లే వచ్చాయి. ఇందుకు సంబంధించి ఫుల్ క్రెడిట్ ఆమెకే ఇస్తాను. చుట్టూ ఉండే మనుషులను, పరిస్థితులను అనుష్క బాగా అర్థం చేసుకుంటుంది’ అన్నారు కోహ్లి. ('రషీద్ వస్తే అంతు చూస్తా అన్నాడు')
జీవిత భాగస్వామిపై కోహ్లి ప్రశంసలు
Published Tue, Jul 28 2020 5:21 PM | Last Updated on Tue, Jul 28 2020 5:46 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment