భార్య పుట్టినరోజున కోహ్లి ఏంచేశాడంటే.. | Virat Kohli Quarantine Story: Baked Cake For First Time Ever | Sakshi
Sakshi News home page

భార్య కోసం మొదటిసారి కోహ్లి ఏంచేశాడంటే..

Published Sun, Jul 26 2020 2:25 PM | Last Updated on Sun, Jul 26 2020 2:44 PM

Virat Kohli Quarantine Story: Baked Cake For First Time Ever - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన ఆఫ్‌ ఫీల్డ్‌ నైపుణ్యాలను బాగా పెంచుకుంటున్నారు. అంతటితో ఆగక ఆ ఆనంద క్షణాలను అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అయితే తాజాగా మయాంక్‌ అగర్వాల్‌తో సరదాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ పుట్టిన రోజున భార్య కోసం తానే కేక్‌ తయారు చేసినట్లు కోహ్లి వెల్లడించారు. అయితే కేక్‌ తయారుచేయడం తన జీవితంలో మొదటి ప్రయత్నం అని.. అయితే ఆ ప్రయత్నం ఫలించి కేక్‌ మంచిగానే వచ్చినట్లు తెలిపారు. అనుష్క శర్మ నుంచి కూడా కేక్‌ బాగుంది. ఈ కేక్‌ నాకు చాలా ప్రత్యేకమైనది' అనే కాంప్లిమెంట్స్‌ వచ్చినట్లు విరాట్ కోహ్లి మయాంక్ అగర్వాల్‌తో అన్నారు. (అలా ఆ సమస్యను అధిగమించా: కోహ్లి)

కాగా.. టీమిండియా క్రికెటర్లలో ఉత్తమ ప్రొటీన్‌ షేక్‌లను తయారుచేసే వారి గురించి మయాంక్‌ అడిగినపుడు.. విరాట్‌ సమాధానంగా మయాంక్ అగర్వాల్‌, నవదీప్‌ షైనీ, తన పేరు చెప్పాడు. ఆ వెంటనే మీరు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు. మొదటి మిమ్మల్ని, తర్వాత నవదీప్‌ షైనీని, ఆ తర్వాత నాకు నేను రేటింగ్‌ ఇచ్చుకుంటాను' అంటూ కోహ్లి సమాధానమిచ్చారు. అయితే లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన కోహ్లి రెగ్యులర్‌ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతోపాటు, పుస్తకాలు చదవడం, కుటుంబంతో వీలైనంత సమయాన్ని గడపడం ద్వారా కరోనా కాలంలో తనను తాను బిజీగా ఉంచుకుంటున్నాడు. ఇక 2020లో ఐపీఎల్‌ సెప్టెంబర్‌ 9 నుంచి ప్రారంభం కానుండటంతో.. ఈ సీజన్‌లో అయినా రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టును విజేతగా నిలపాలనుకుంటున్నాడు. గత 12 సీజన్‌లలోనూ బెంగళూరు జట్టుకు నిరాశే ఎదురైన సంగతి తెలిసిందే.  (ముగింపు బాగుండాల్సింది: అనిల్‌ కుంబ్లే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement