IPL 2023: Klaasen-Try-Stop Jadeja From Catch But Dhoni Made Stump Mayank Out - Sakshi
Sakshi News home page

#JadejaVsKlassen: క్లాసెన్‌ అడ్డుకున్నా.. ఈసారి ధోని వదల్లేదు!

Published Fri, Apr 21 2023 8:55 PM | Last Updated on Sat, Apr 22 2023 7:12 AM

Klaasen-Try-Stop Jadeja From Catch But Dhoni Made Stump Mayank Out - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. 92 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సంగతి పక్కనబెడితే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ జడేజా వేశాడు. ఓవర్‌ తొలి బంతిని మయాంక్‌ స్ట్రెయిట్‌ షాట్‌ ఆడాడు.


Photo: IPL Twitter

అయితే జడ్డూ క్యాచ్‌ తీసుకునే అవకాశం వచ్చింది. కానీ ఇదే సమయానికి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న క్లాసెన్‌ జడ్డూ క్యాచ్‌ అందుకునే క్రమంలో అతనికి అడ్డుగా వచ్చాడు. దీంతో జడ్డూ ఫ్లోర్‌పై పడిపోయాడు. అయితే యాదృశ్చికంగా జరిగిందా లేక క్లాసెన్‌ కావాలనే అడ్డుకున్నాడా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంలో జడేజా క్లాసెన్‌వైపు ''ఇదేంటి'' అన్నట్లుగా సీరియస్‌ లుక్‌ ఇచ్చాడు. 


Photo: IPL Twitter

అయితే క్లాసెన్‌ తనకు వచ్చిన లైఫ్‌ను మయాంక్‌ కాపాడుకోలేకపోయాడు. అదే ఓవర్‌లో ఐదో బంతికి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఔట్‌సైడ్‌ ఆఫ్‌ దిశగా వేసిన బంతిని ఆడేందుకు మయాంక్‌ ఫ్రంట్‌ఫుట్‌ వచ్చాడు. అయితే బంతి మిస్‌ అయి ధోని చేతుల్లో పడింది. కీపింగ్‌లో సూపర్‌ టైమింగ్‌ కనబరిచే ధోని క్షణం ఆలస్యం చేయకుండా స్టంపింగ్‌ చేశాడు. దీంతో మయాంక్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. మయాంక్‌ ఔటైన అనంతరం క్లాసెన్‌వైపు సీరియస్‌ లుక్‌ ఇచ్చిన జడేజా.. బాగుందా అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వడం హైలెట్‌గా నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement