ముంబై : ఎంఎస్ ధోని.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా కెప్టెన్‌గా భారత్‌కు రెండు సార్లు ప్రపంచకప్ అందించిన ఘనత అందుకున్నాడు. వన్డే, టెస్టు, టీ20 ల్లో ఇండియాను నంబర్‌వన్ స్థానంలో నిలిపాడు. అయితే ధోనిని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేసిన ధోని ఆ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అలా వరుసగా 4 మ్యాచ్‌లో విఫలమైన ధోని విశాఖపట్నం వేదికగా పాక్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. (‘గంగూలీ అంటే అసహ్యం పుట్టేది’)
ఆ వన్డేలో 123 బంతుల్లోనే 15 బౌండరీలు 4 సిక్స్‌ల సాయంతో 148 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. అప్పటినుంచి తన 16 సంవత్సరాల కెరీర్‌లో మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం ధోనికి లేకుండా పోయింది. ఇక వికెట్ కీపర్‌గా ధోని ప్రదర్శన గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే అవుతుంది. తాజాగా మంగళవారం 39వ పుట్టినరోజు జరుపుకుంటున్న ధోనికి అభిమానులతో పాటు పలువురు ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మయాంక్ అగర్వాల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎంఎస్ ధోని గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
"I'm happy that Indian cricket got a Mahendra Singh Dhoni, because he is unbelievable," @SGanguly99 to @mayankcricket on #DadaOpensWithMayank #HappyBirthdayMSDhoni @msdhoni pic.twitter.com/KCua8qq4hu
— BCCI (@BCCI) July 7, 2020
'2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో ధోనిని ఎంపిక చేయాలని సెలెక్టర్లను కోరాను. కానీ ఒక కెప్టెన్‌గా నేను జట్టును మాత్రమే ఏంచుకోగలను.. నేను ఆరోజు చేసిన ప్రతిపాధనపై జట్టులోకి తీసుకున్న ధోని ఆ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కానీ అతని ఆటతీరుపై నాకు నమ్మకముంది. ఒక వికెట్‌కీపర్‌గా జట్టులోకి వచ్చిన ధోనిని పాక్‌తో జరిగిన రెండో వన్డేకు రాహుల్ ద్రవిడ్‌ను కాదని నెంబర్ 3 స్థానంలో ధోనిని పంపాలని నిర్ణయించుకున్నా. సరిగ్గా ఇదే మ్యాచ్‌లో ధోని తన ఆటతీరు ఎలా ఉంటుందో మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక అక్కడినుంచి వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ప్రపంచ క్రికెట్‌లో అతనొక అత్యుత్తమ ఆటగాడే కాదు.. మంచి ఫినిషర్ కూడా. ఎన్నో మ్యాచ్‌ల్లో ఫినిషర్‌గా వచ్చి లోవర్ ఆర్డర్ సాయంతో జట్టును గెలిపించిన తీరుపై ఇప్పటికి మాట్లాడుతూనే ఉంటారు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆటగాళ్లు క్రికెట్‌లో పరిచయం అవుతుంటారు.(ధోని మౌనం వీడేనా ?)
కానీ ఒక దశాబ్ధంలో కొందరే క్రికెటర్లు తమదైన ముద్ర వేస్తారు. అందులో ధోనికి కూడా సమున్నతమైన స్థానం ఉందనంలో సందేహం లేదు. ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు తమ జట్టును గెలిపించాలనే ఉత్సాహంతో చాలా మంది ఆటగాళ్లు ఒత్తిడికి లోనవుతుంటారు, కానీ ధోని మాత్రం ఒత్తిడిని జయించి ఎన్నో మ్యాచ్‌ల్లో గెలిపించాడు. అదే ఎంఎస్ ధోని ప్రత్యేకత. అందుకే నేను ధోనికి ప్రియమైన అభిమానిగా మారిపోయాను.నిజంగా టీమిండియాకు ధోని లాంటి ఆటగాడు దొరకడం అదృష్టంగా చెప్పొచ్చు.'అంటూ చెప్పుకొచ్చాడు. సుధీర్ఘ పార్మాట్‌లో 90 టెస్టులాడిన ధోని 4,786 పరుగులు చేశాడు. ఇక ఇప్పటివరకు 350 వన్డేలాడిన ధోని 10773 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 73 అర్థ సెంచరీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment