IPL 2023: Battle For Survival As David Warner's Delhi Capitals Face SunRisers Hyderabad - Sakshi
Sakshi News home page

IPL 2023: ఢిల్లీతో మ్యాచ్‌.. సన్‌రైజర్స్‌ జట్టులో కీలక మార్పులు! 8 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్‌!

Published Mon, Apr 24 2023 4:43 PM | Last Updated on Mon, Apr 24 2023 5:05 PM

Battle For Survival As David Warners Delhi Capitals Face SRH - Sakshi

PC: IPL.com

IPL 2023- SRH Vs DCఐపీఎల్‌-2023లో సీఎస్‌కే చేతిలో ఘోర ఓటమి చవి చూసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉప్పల్‌ వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ఆరెంజ్‌ ఆర్మీ భావిస్తోంది.

వాళ్లిద్దరు అవుట్‌
అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ రెండు మార్పులతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతున్న మయాంక్‌ అగర్వాల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా 8.25 కోట్ల భారీ మొత్తాన్ని తీసుకున్న అగర్వాల్‌.. తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలో మయాంక్‌ స్ధానంలో సమర్థ్ వ్యాస్, సుందర్‌ ప్లేస్‌లో మయాంక్‌ దాగర్‌కు అవకాశం ఇవ్వాలని ఎస్‌ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్‌ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

వీళ్లకు ఛాన్స్‌
సౌరాష్ట్రకు చెందిన వ్యాస్‌కు దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 41 మ్యాచ్‌లు ఆడిన వ్యాస్‌ 1365 పరుగులు సాధించాడు. అదే విధంగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన మయాంక్ దాగర్‌.. వికెట్లు తీయకపోయినప్పటికీ పర్వాలేదనపించాడు. 3 ఓవర్లు వేసిన దాగర్‌ 21 పరుగులిచ్చాడు. ఇక కేకేఆర్‌తో గెలిచి మంచి ఊపు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ ఎంతవరకు అడ్డుకుంటుందో వేచి చూడాలి.

ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు(అంచనా)
హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌) వ్యాస్‌, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌ కీపర్‌), మార్కో జాన్సెన్, మయాంక్‌ దాగర్‌, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్ఖండే, ఉమ్రాన్ మాలిక్
చదవండిMohammed Siraj: మహిపాల్‌ను దూషించిన సిరాజ్‌! ఇప్పటికే రెండుసార్లు సారీ చెప్పాను.. పర్లేదు భాయ్‌! ఇలాంటివి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement