
IPL 2022: పంజాబ్ కింగ్స్ విజయం.. ముంబైకి తప్పని ఓటమి
Published Wed, Apr 13 2022 7:10 PM | Last Updated on Wed, Apr 13 2022 11:32 PM

Advertisement
Advertisement
ఢాకా: అంతర్గత తిరుగుబాటు ద్వారా యూను�...
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్ర...
అంబేద్కర్ కోనసీమ జిల్లా, సాక్షి: ఆరుగ...
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: ఎన్నికల హామ�...
మనం ఎవరైనా.. ఏదో సందర్భవశాత్తు.. తప్పన�...
వాషింగ్టన్: అమెరికాలో విదేశీ విద్యా...
ఎన్టీఆర్, సాక్షి: సవాళ్లు , ప్రతిసవాళ్...
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ �...
తూర్పుగోదావరి, సాక్షి: ఆడపిల్లలకు అన�...
రాయ్‌గఢ్: ఛత్తీస్‌ఘడ్ మరో భారీ ఎన్�...
కోల్‌కతా: సంచలన ఆర్జీకర్ ఘటనపై కేంద�...
చిత్తూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలన�...
బెంగళూరు: వీడియో కాల్ చేసి.. ఆపై నగ్న�...
Earthquake Live Rescue OP Updates👉మయన్మార్, థాయ్‌లాండ్�...
ఢిల్లీ : మయన్మార్, థాయ్‌లాండ్‌లను భూ�...
Published Wed, Apr 13 2022 7:10 PM | Last Updated on Wed, Apr 13 2022 11:32 PM
IPL 2022: ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అప్డేట్స్
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓడి వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఒక దశలో బ్రెవిస్(49), తిలక్ వర్మ(36), సూర్యకుమార్ యాదవ్(43) రాణించడంతో గెలుపుపై ఆశలు కలిగాయి. కానీ ముంబై మధ్యలో అనవసరంగా వికెట్లు పోగొట్టుకొని చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. పంజాబ్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ 4, రబాడ 2,వైభవ్ అరోరా ఒక వికెట్ తీశాడు.
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ మరోసారి పరాజయం దిశగా పయనిస్తోంది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అంతకముందు 43 పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు.
సూర్యకుమార్ యాదవ్‌తో సమన్వయ లోపం వల్ల తిలక్ వర్మ(36) రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అంతకముందు డెవాల్డ్ బ్రెవిస్ 49 పరుగులు చేసి ఔటయ్యాడు.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ డెవాల్డ్ బ్రెవిస్ రాహుల్ చహర్‌కు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఒక ఫోర్ సహా నాలుగు సిక్సర్లు బాదిన బ్రెవిస్ చహర్ నుంచి 29 పరుగులు పిండుకున్నాడు. ప్రస్తుతం ముంబై 2 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. బ్రెవిస్ 44, తిలక్ వర్మ 15 పరుగులతో ఆడుతున్నారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. మొదట ఇన్నింగ్స్ 4వ ఓవర్లో రబాడ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(26)ఔట్ కాగా.. మరుసటి ఓవర్లో ఇషాన్ కిషన్(3) పరుగులు చేసి వైభవ్ అరోరా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోరు చేసింది. శిఖర్ ధావన్ 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 52 పరుగులు సాధించాడు. ఇక చివర్లో జితేశ్ శర్మ 14 బంతుల్లో 30 పరుగులతో మెరవడంతో పంజాబ్‌కు భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో బాసిల్ థంపి 2, బుమ్రా, ఉనాద్కట్, మురుగన్ అశ్విన్ తలా ఒక వికెట్ తీశారు.
50 బంతుల్లో 70 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన ధావన్ బాసిల్ థంపి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అదే ఓవర్లో సూపర్ సిక్స్‌తో మెరిసిన ధావన్ మరోసారి అదే తరహా షాట్‌కు యత్నించి పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
బుమ్రా సూపర్ యార్కర్‌కు లివింగ్‌స్టోన్(2) మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు 12 పరుగులు చేసిన బెయిర్ స్టో ఉనాద్కట్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అవ్వడంతో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ధావన్ 52 పరుగులతో ఆడుతున్నాడు.
12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. ధావన్ 43, జానీ బెయిర్ స్టో 5 పరుగులతో ఆడతున్నారు.
మయాంక్ అగర్వాల్(52) రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో మయాంక్ సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రసస్తుం పంజాబ్ వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.
ముంబైతో మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్ దాటిగా ఆరంభించింది. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 38, శిఖర్ ధావన్ 18 పరుగులతో ఆడుతున్నారు..
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మూడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 14, శిఖర్ ధావన్ 10 పరుగులతో ఆడుతున్నారు.
ఐపీఎల్ 2022లో బుధవారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు మొదలైంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇంతవరకు బోణీ కొట్టలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ వరుసగా పరాజయాలు చవిచూసిన ముంబై పూర్తి ఒత్తిడిలో ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి.. రెండు ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 28 సార్లు పోటీ జరగ్గా.. ముంబై 15.. పంజాబ్ 13సార్లు నెగ్గింది. 2019 నుంచి చూసుకుంటే ఇరుజట్లు ఆరుసార్లు పోటీ పడితే చెరో మూడు మ్యాచ్‌లు గెలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment