Mayank Agarwal Praise Dravid For Test Comeback.. ఇటీవలే న్యూజిలాండ్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో మయాంక్ అగర్వాల్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. ముంబై వేదికగా జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 150.. రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన మయాంక్ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో మయాంక్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 11వ స్థానానికి చేరుకున్నాడు.
చదవండి: Ashes 2021: నాలుగు రోజుల్లోనే ముగించారు.. తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం
తాను ఫామ్‌లోకి రావడం వెనుక టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇచ్చిన సలహా ఎంతో ఉపయోగపడిందని.. టెస్టుల్లో నా కమ్‌బ్యాక్‌కు కారణమయిందంటూ మయాంక్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ బెంగళూరులో తన కోచ్ ఆర్‌ఎక్స్ మురళీ వద్ద బ్యాటింగ్‌కు సంబంధించి మరిన్ని టెక్నిక్స్ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపికైన 18 మందిలో మయాంక్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. త్వరలోనే జట్టుతో పాటు సఫారీ పర్యటనకు వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో మయాంక్ కివీస్‌తో సిరీస్‌లో తన అనుభవాలను పంచుకున్నాడు.
'' నీకు ఇప్పుడు పరుగులు చాలా అవసరం అని తెలుసు. పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న బాధ నేను అర్థం చేసుకుంటా. నీకున్న ఎమోషన్స్‌తో పాటు మానసిక శక్తిని.. ఆలోచనలను అదుపులో ఉంచుకో. ఓపికతో ఆడు.. కచ్చితంగా ఫలితం సాధిస్తావు. ఇక టెక్నిక్ విషయంలో చెప్పడానికి ఏం లేదు. గతంలో పరుగులు చేయడానికి ఏదైతే చేశావో దానికే మళ్లీ కట్టుబడి ఆడాలి.. పరుగులు వాటంతటవే వస్తాయి.'' అని ద్రవిడ్ చెప్పినట్లు మయాంక్ తెలిపాడు.
చదవండి: Mayank Agarwal: ఆయన వీడియోలు చూసి నా బ్యాటింగ్ స్టైల్ మార్చుకున్నా..
Comments
Please login to add a commentAdd a comment