
టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వెస్టిండీస్‌తో మొదటి మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇందుకు గల కారణం తాజాగా వెల్లడైంది. రాహుల్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయట. అతడి సోదరి భావన వివాహం త్వరలోనే జరుగనున్నట్లు తెలుస్తోంది. చెల్లి పెళ్లి పనుల్లో నిమగ్నమైన రాహుల్ అందుకే మొదటి వన్డేకు దూరమైనట్లు సమాచారం. కాగా స్వదేశంలో విండీస్‌తో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌కు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌కు 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించారు. కేఎల్ రాహుల్ రెండో వన్డేతో జట్టుతో కలుస్తాడని బీసీసీఐ పేర్కొంది. అయితే, తాజాగా టీమిండియా శిబిరంలో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ తదితరులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 6న సిరీస్ ఆరంభమవుతుందా లేదా అన్న సందిగ్దం నెలకొంది.
ముఖ్యంగా ధావన్, రుతురాజ్ వైరస్ బారిన పడటంతో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఎవరు ఓపెనింగ్ చేస్తారన్న విషయం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో రాహుల్‌ను పిలిపించాలని భావించినా... వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు దూరమైన నేపథ్యంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మయాంక్‌ను వన్డే జట్టులో చేర్చినట్లు బీసీసీఐ గురువారం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
చెల్లి పెళ్లి కోసమే?
ఇక రాహుల్ విషయానికొస్తే... మంగళూరులోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి పేరు డాక్టర్ కేఎన్ లోకేశ్. ఆయన ప్రొఫెసర్. ఇక రాహుల్ తల్లి రాజేశ్వరి. ఆమె కూడా ప్రొఫెసరే. కేఎల్ రాహుల్‌కు చెల్లెలు భావన ఉంది. ఆమెకు పెళ్లి సెటిలైందని, ఆ పనులతోనే రాహుల్ బిజీగా ఉన్నట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో తన కథనంలో వెల్లడించింది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టితో రాహుల్ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా!
IND vs WI: క్రికెట్ అభిమానులకు భారీ షాక్.. భారత్- విండీస్ తొలి వన్డే వాయిదా!
Comments
Please login to add a commentAdd a comment