IPL 2022 PBKS Vs LSG: Fans Troll Punjab Batting For Chase Against Lucknow Viral - Sakshi
Sakshi News home page

PBKS Vs LSG: చెత్తగా ఆడారు.. టీమ్‌ను అమ్మిపారేయండి.. అప్పుడే!

Published Sat, Apr 30 2022 8:58 AM | Last Updated on Sat, Apr 30 2022 12:17 PM

IPL 2022 PBKS Vs LSG: Fans Troll Punjab Batting For Chase Against Lucknow - Sakshi

పంజాబ్‌ కింగ్స్‌ జట్టు(PC: IPL/BCCI)

IPL 2022- LSG Beat PBKS By 20 Runs: లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఓటమిపై ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ముఖ్యంగా బ్యాటర్ల ఆట తీరుపై మండిపడుతున్నారు. చెత్త ప్రదర్శన అంటూ విమర్శిస్తున్నారు. కాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో పరాజయంతో ఐపీఎల్‌-2022లో పంజాబ్‌ ఐదో ఓటమి చవిచూసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది.

ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(5) వైఫల్యం తీవ్ర ప్రభావం చూపింది. కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌(25), జానీ బెయిర్‌స్టో(32), లియామ్‌ లివింగ్‌స్టోన్‌(18), రిషి ధావన్‌(21) మినహా మిగతా వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితం కావడం గమనార్హం. దీంతో పంజాబ్‌ బ్యాటర్లకు సోషల్‌ మీడియా వేదికగా చురకలు అంటిస్తున్నారు ఫ్యాన్స్‌.

‘‘ఇక వీళ్లు మారరు. మేనేజ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని, కోచ్‌ను మార్చండి. టీమ్‌ మొత్తాన్ని అమ్మిపారేయండి. చెత్త షాట్లు. చెత్త బ్యాటింగ్‌. అనిల్‌ కుంబ్లే ముఖం చూస్తేనే వీళ్ల ఆట తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. ఏదేమైనా కేఎల్‌ రాహుల్‌ జట్టు మారాక అద్భుత ఫలితాలు సాధిస్తుంటే.. పంజాబ్‌ మాత్రం ఇలా వెనుకబడిపోతోంది’’ అంటూ మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని కొత్త జట్టు లక్నో.. పంజాబ్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. బౌలర్ల విజృంభణతో ఆరో విజయాన్ని నమోదు చేసింది. తద్వారా 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి చేరింది. 

ఐపీఎల్‌ మ్యాచ్‌-42: పంజాబ్‌ వర్సెస్‌ లక్నో మ్యాచ్‌ స్కోర్లు
లక్నో- 153/8 (20)
పంజాబ్‌- 133/8 (20)

చదవండి👉🏾Krunal Pandya: ఆయన వల్లే ఇదంతా.. బ్యాట్‌తో కూడా రాణిస్తా: కృనాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement