IPL 2022: KL Rahul Reveals Reason Behind Why He Left Punjab Kings, Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2022- KL Rahul: పంజాబ్‌ కింగ్స్‌ను వీడటానికి ముఖ్య కారణం అదే: కేఎల్‌ రాహుల్‌

Published Mon, Mar 21 2022 1:45 PM | Last Updated on Wed, Mar 23 2022 6:40 PM

IPL 2022: KL Rahul Reveals Why He Left Punjab Kings Tough Call But - Sakshi

లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(PC: KL Rahul Twitter)

KL Rahul Reveals Why He Left Punjab Kings: ‘‘నాలుగేళ్ల పాటు వారితో కలిసి ఉన్నాను. ఐపీఎల్‌ ప్రయాణంలో నేను కొత్తగా ఏం నిరూపించుకోగలనో చూడాలని భావించాను. నిజానికి ఈ నిర్ణయం చాలా కఠినమైనది. ఎందుకంటే సుదీర్ఘ కాలంగా నాకు పంజాబ్‌తో విడదీయలేని బంధం ఉంది. కానీ కొత్తగా ఏదైనా చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌, ఐపీఎల్‌ కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. 

కాగా పంజాబ్‌ కింగ్స్‌కు రాహుల్‌ సారథిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్‌-2021 సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌లో అతడు 626 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 98 నాటౌట్‌. ఇలా బ్యాటర్‌గా సఫలమైనా.. కెప్టెన్‌గా మాత్రం రాహుల్‌ మంచి మార్కులు సాధించలేకపోయాడు. జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చలేకపోయాడు. మరోవైపు.. లక్నో రూపంలో కొత్త జట్టు ఎంట్రీతో రాహుల్‌కు మంచి అవకాశం వచ్చింది.

ఈ పరిణామాల క్రమంలో తనను రిటైన్‌ చేసుకోవద్దని పంజాబ్‌ ఫ్రాంఛైజీ రాహుల​ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. వాటిని నిజం చేస్తూ పంజాబ్‌ అతడిని రిలీజ్‌ చేసింది. ఈ క్రమంలో లక్నో రాహుల్‌ను సొంతం చేసుకుని కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ రెడ్‌బుల్‌ క్రికెట్‌ సెషన్‌లో మాట్లాడుతూ.. కొత్త సవాళ్లను ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే పంజాబ్‌ను వీడినట్లు తెలిపాడు. ఈ విషయం గురించి పంజాబ్‌ ఫ్రాంఛైజీతో మాట్లాడి తనను రిటైన్‌ చేసుకోవద్దని చెప్పినట్లు పేర్కొన్నాడు.   

చదవండి: IPL 2022: షాట్లతో అలరించిన రిషభ్‌ పంత్‌.. రెప్పవాల్చని యువ ఆటగాళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement