
PC: IPL Twitter
SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కా�...
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ�...
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా...
విజయవాడ, సాక్షి: గ్రూప్ 2 మెయిన్స్ ప�...
గుంటూరు, సాక్షి: లాభాల బాటలో నడిచిన ఫై...
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్�...
ఈ భూమ్మీద అత్యంత ధనికుడు ఎవరు?.. ప్రస్�...
నల్లగొండ: ఎస్ఎల్బీసీ పనుల్లో శనివారం...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్త...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇది కాల�...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనా...
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల క్రిత�...
పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మ...
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమ�...
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర�...
Published Fri, Apr 29 2022 7:06 PM | Last Updated on Fri, Apr 29 2022 11:20 PM
PC: IPL Twitter
IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లైవ్ అప్డేట్స్
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది.
లక్నో బౌలర్ల దాటికి పంజాబ్ బ్యాట్స్‌మెన్ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. జానీ బెయిర్ స్టో 32 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మయాంక్ అగర్వాల్ 25 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 3, కృనాల్ పాండ్యా, చమీర చెరో రెండు వికెట్లు తీశారు.
154 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 92 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెయిర్ స్టో 21, రిషి ధవన్ క్రీజులో ఉన్నారు.
11 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ 16, బెయిర్ స్టో 19 పరుగులతో ఆడుతున్నారు.
లక్నోతో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ లక్ష్యచేధనలో తడబడుతుంది. 9 పరుగులు చేసిన బానుక రాజపక్స కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు రవి బిష్ణోయి బౌలింగ్‌లొ 5 పరుగులు చేసిన ధావన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది.
154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్(25) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. చమీర బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. డికాక్ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. దీపక్ హుడా 34 పరుగులు చేశాడు. చివర్లో దుశ్మంత చమీర రెండు సిక్సర్లతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రబాడ 4, రాహుల్ చహర్ 2, సందీప్ శర్మ ఒక వికెట్ తీశాడు.
17 ఓవర్లు ముగిసేసరికి లక్నో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. జాసన్ హోల్డర్ 4, దుష్మంత చమీర 4 పరుగులతో ఆడుతున్నారు.
ఆయుష్ బదోని(4) రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ ఐదో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి బదోని వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. తొలుత కృనాల్ పాండ్యా సమన్వయంతో దీపక్ హుడా(34) రనౌట్ కాగా.. ఆ తర్వాత రబాడ బౌలింగ్‌లో కృనాల్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది.
నిలకడగా ఆడుతున్న క్వింటన్ డికాక్(46) సందీప్ శర్మ బౌలింగ్‌లో కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పంజాబ్ ఆటగాళ్లు అప్పీల్ చేసినప్పటికి అంపైర్ ఔటివ్వలేదు. అయితే డికాక్ మాత్రం తాను ఔట్ అంటూ క్రీజును వీడాడు.
ప్రస్తుతం 13 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. దీపక్ హుడా 34, కృనాల్ పాండ్యా 5 పరుగులతో ఆడుతున్నారు.
9 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 30 పరుగులు, దీపక్ హుడా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.
పంజాబ్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన కేఎల్ రాహుల్ రబాడ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది.
ఐపీఎల్-2022లో శుక్రవారం(ఏప్రిల్ 29) లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్నాయి.
సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండోసారి గెలిచింది. బలాబలాల్లో ఇరుజట్లు సమానంగా ఉండడంతో ఆసక్తికర పోరు జరగడం ఖాయం. పంజాబ్ కింగ్స్‌కు ధావన్ ఫాం పెద్ద బలం కాగా.. అటు లక్నో సూపర్ జెయింట్స్‌కు కేఎల్ రాహుల్ సగం బలం అని చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment