మయాంక్ అగర్వాల్(PC: BCCI)
India Tour Of England 2022: ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టు నేపథ్యంలో టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్ బయల్దేరుతున్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది కోవిడ్ కలకలం కారణంగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్టు నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జూలై 1 నుంచి ఈ మ్యాచ్ నిర్వహించేందుకు ఇరు జట్లు నిర్ణయించాయి. అయితే, రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ టెస్టుకు దూరం కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో అతడు ఐసోలోషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
దీంతో స్టాండ్ బై ఓపెనర్‌గా మయాంక్‌ను ఇంగ్లండ్‌కు పంపించననున్నట్లు సమాచారం. ఒకవేళ టెస్టు ఆరంభం నాటికి రోహిత్ శర్మ అందుబాటులో లేనట్లయితే టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి మయాంక్ అగర్వాల్ భారత ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. ఈ మేరకు క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. ఇంగ్లండ్‌లో ప్రస్తుతం క్వారంటైన్ నిబంధనలు లేనందున అతడు త్వరగానే జట్టుతో చేరే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.
చదవండి: IND Vs IRE- Hardik Pandya: మరీ ఇంత స్వార్థం పనికిరాదు! పాండ్యాపై నెటిజన్ల ఫైర్
India Tour Of England 2022 Schedule: ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సై.. పూర్తి షెడ్యూల్, ‘జట్టు’ వివరాలు!
Ranji Trophy 2022: 'కెప్టెన్ పెళ్లికి రెండు రోజుల సెలవు మాత్రమే ఇచ్చాను'
Comments
Please login to add a commentAdd a comment