PC: IPL.com
ఐపీఎల్-2023లో మరో కీలక పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్ తలపడనుంది. ఈ మ్యాచ్ మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇరు జట్లు కూడా వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్నాయి. మరో సారి క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగుంచేందుకు ఈ రెండు జట్లు సిద్దమయ్యాయి.. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఒకే మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
మయాంక్ ఔట్.. సుందర్ ఇన్
వరుసగా విఫలమవతున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను పక్కన పెట్టాలని సన్‌రైజర్స్ మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 8.25 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసిన మయాంక్.. తన స్థాయికి తగ్గట్టు రాణించలేక పోతున్నాడు. ఇక అతడి స్థానంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రానున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఒకే వేళ మయాంక్ దూరమైతే బ్రూక్ జోడిగా అభిషేక్ శర్మ వచ్చే అవకాశం ఉంది.
ఇక బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఎస్‌ఆర్‌హెచ్ పటిష్టంగా కన్పిస్తోంది. విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్ ఫామ్‌లోకి రావడం ఆరెంజ్ ఆర్మీకి మరింత బలం చేకూరుస్తోంది. అదే విధంగా కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. పేసర్ మార్కో జానెసన్ ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మరోవైపు స్పిన్నర్ మార్కండే కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. వీరికి తోడు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా తన స్థాయికి తగ్గట్టు రాణిస్తే.. ముంబై బ్యాటర్లకు చుక్కలు కనిపించడం ఖాయం.
ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు(అంచనా):
హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మ,, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, మయాంక్ మార్కండే
Comments
Please login to add a commentAdd a comment