Ind Vs Sa Test Series: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ టీమిండియా ఆటగాళ్లు సురక్షిత వాతావరణంలో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఐరిని కంట్రీ లాడ్జ్‌లో బయో బబుల్‌లో క్రికెటర్లను ఉంచింది. బయటి నుంచి అతిథులు ఎవరినీ ఇందులోకి అనుమతించడం లేదు. అంతేకాదు హోటల్ సిబ్బంది కూడా ఇప్పటికే క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఆటగాళ్లు, సిబ్బందికి రెగ్యులర్‌గా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.
కాగా కోవిడ్ విజృంభించిన తొలినాళ్లలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టు, ఆ తర్వాత పాకిస్తాన్ టీమ్ కూడా ఇక్కడే ఉంటూ విజయవంతంగా టూర్‌ను ముగించాయి. ఈ క్రమంలో టీమిండియాకు సైతం ప్రొటిస్ బోర్డు ఇక్కడే ఆతిథ్యం ఇస్తోంది. ఈ హోటల్‌కు సంబంధించిన విశేషాలు తెలిపేలా ఇప్పటికే రిషభ్ పంత్, మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్ పలు ఫొటోలను షేర్ చేశారు.
తాజాగా మయాంక్ అగర్వాల్ సైతం.. బోనఫైర్(చలిమంట)తో ఉపశమనం పొందుతున్న చిత్రాలను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో.. ‘‘అక్కడ చలి ఎక్కువగా ఉందా భయ్యా! ఏదేమైనా మీరంతా రిస్క్ చేసి దక్షిణాఫ్రికా వెళ్లారు. సేఫ్‌గా ఉండండి. అలాగే సిరీస్ కూడా గెలవాలి. నువ్వు సెంచరీలు సాధించాలి’’అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో రెండో టెస్టులో అదరగొట్టిన మయాంక్ అగర్వాల్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్‌తో కలిసి మయాంక్ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. ఇక కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ప్రొటిస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. డిసెంబరు 26 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది.
చదవండి: Virat Kohli: కోహ్లి ఆడిన మ్యాచ్‌ల్లో సగం కూడా ఆడలేదు.. వాళ్లకేం తెలుసు!
Comments
Please login to add a commentAdd a comment