మెగా వేలం-2025లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఎగబడ్డాయి. రూ. 2 కోట్ల కనీస ధరకు ఆక్షన్‌లోకి వచ్చిన ఈ ముంబై బ్యాటర్‌ను దక్కించుకునేందుకు పాత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తగ్గేదేలే అన్నట్లు రేసులో మున్ముందుకు దూసుకుపోయాయి.
నువ్వా- నేనా అన్నట్లు ఢిల్లీ, పంజాబ్ తలపడటంతో శ్రేయస్ అయ్యర్ ధర రూ. 20 కోట్లు దాటింది. దీంతో కోల్‌కతా పోటీ నుంచి తప్పుకోగా.. సరైన కెప్టెన్లు లేని కారణంగా ఢిల్లీ, పంజాబ్ మాత్రం అయ్యర్ ధరను అంతకంతకూ పెంచుతూ పోయాయి.
ఆఖరికి ఢిల్లీ వెనక్కి తగ్గగా.. రూ. 26.75 కోట్లకు పంజాబ్ తమ సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా అయ్యర్ చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు మొదటి ప్లేయర్‌గా వేలంలోకి వచ్చిన మరో టీమిండియా స్టార్, పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా పంజాబ్ భారీ ధరకు సొంతం చేసుకుంది.
కెప్టెన్ కోసం..
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన ఘనత శ్రేయస్ అయ్యర్ సొంతం. అయినప్పటికీ కోల్‌కతా రిటెన్షన్‌కు ముందు అతడిని వదిలేసింది. దీంతో అతడు మెగా వేలంలోకి హాట్‌కేకు అవుతాడని అంతా ముందే ఊహించారు.
అందుకు తగ్గట్లుగానే అయ్యర్ భారీ ధర పలకడం విశేషం. కాగా పంజాబ్ ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. అంతేకాదు వేలానికి ముందు కేవలం ఇద్దరిని రిటైన్ చేసుకుని అందరినీ విడిచిపెట్టింది.
దీంతో రూ. 110.5 కోట్ల పర్సు వాల్యూతో వేలంలోకి వచ్చింది. దీంతో అయ్యర్ కోసం ఈ మేర ఖర్చు చేసింది. అయితే, పంత్‌ను లక్నో రూ. 27 కోట్లకు కొనడంతో అయ్యర్ రికార్డు బ్రేక్ అయింది.కాగా ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు 115 మ్యాచ్‌లు ఆడి.. 3127 పరుగులు చేశాడు.
చదవండి: Rishabh Pant: అయ్యర్ రికార్డు బ్రేక్.. కోట్లు కొల్లగొట్టిన పంత్! లక్నో సొంతం
Missed watching that stunning Shreyas bidding process❓
We have you covered here with the snippets 🎥 🔽#TATAIPLAuction | #TATAIPL | @ShreyasIyer15 | @PunjabKingsIPL | #PBKS pic.twitter.com/a7jAki8LVz— IndianPremierLeague (@IPL) November 24, 2024
Comments
Please login to add a commentAdd a comment