
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అత్యంత భారీ ధర పలికాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆదిలోనే పోటీకి దిగాయి. ఇరు ఫ్రాంఛైజీలు పంత్ కోసం హోరాహోరీగా తలపడి వేలం మొదలైన కాసేపటికే ధరను రూ. 10 కోట్లకు పెంచాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రేసులోకి వచ్చి
ఆ తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు పంత్ ధరను పెంచుతూ పోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రేసులోకి వచ్చి.. రూ. 13 కోట్లకు పెంచింది. ఈ క్రమంలో ఆర్సీబీ తప్పుకోగా.. హైదరాబాద్, లక్నో నువ్వా- నేనా అన్నట్లు దూకుడు పెంచాయి.
శ్రేయస్ అయ్యర్ రికార్డు బ్రేక్
అయితే, రూ. 20 కోట్లకు ధర పెరిగిన తర్వాత హైదరాబాద్ పోటీ నుంచి తప్పుకొంది. అయితే, అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ ద్వారా రేసులోకి రాగా.. లక్నో అమాంతం ఏడు కోట్లు పెంచింది. మొత్తంగా రూ. 27 కోట్ల భారీ ధరకు పంత్‌ను లక్నో సొంతం చేసుకుంది. దీంతో శ్రేయస్ అయ్యర్ రికార్డు బ్రేక్ అయింది.
పడిలేచిన కెరటం
కాగా 2022 చివర్లో పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రమైన గాయాలపాలైనా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఈ ఏడాది పునరాగమనం చేశాడు. ఈ సీజన్‌లో మొత్తంగా 13 ఇన్నింగ్స్‌లో కలిపి 446 పరుగులు చేశాడు.
సారథిగా జట్టును ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయినా.. ఆరో స్థానంలో నిలపగలిగాడు. ఇక టీమిండియా తరఫున రీఎంట్రీలో కూడా అదరగొడున్నాడు. అయితే, వేలానికి ముందు ఢిల్లీ అతడిని వదిలేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో పంత్ ఇప్పటి వరకు 111 మ్యాచ్‌లు ఆడి 3284 పరుగులు సాధించాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు
👉రిషభ్ పంత్(లక్నో సూపర్ జెయింట్స్- 2025)- రూ. 27 కోట్లు(వికెట్ కీపర్ బ్యాటర్- టీమిండియా)
👉శ్రేయస్ అయ్యర్(పంజాబ్ కింగ్స్- 2025)- రూ. 26.75 కోట్లు(బ్యాటర్- టీమిండియా)
👉మిచెల్ స్టార్క్(కోల్‌కతా నైట్ రైడర్స్- 2024)- రూ. 24.75 కోట్లు(పేస్ బౌలర్)
👉ప్యాట్ కమిన్స్(సన్‌రైజర్స్ హైదరాబాద్- 2024)- రూ. 20.5 కోట్లు(పేస్ బౌలర్- ఆస్ట్రేలియా)
👉సామ్ కర్రాన్(పంజాబ్ కింగ్స్- 2023)- రూ. 18.50 కోట్లు(ఆల్‌రౌండర్- ఇంగ్లండ్).
చదవండి: IPL 2025: కేఎల్ రాహుల్‌కు భారీ షాక్..
𝗥𝗲𝗰𝗼𝗿𝗱-𝗯𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 𝗥𝗶𝘀𝗵𝗮𝗯𝗵 🔝
Snippets of how that Historic bidding process panned out for Rishabh Pant 🎥 🔽 #TATAIPLAuction | #TATAIPL | @RishabhPant17 | @LucknowIPL | #LSG pic.twitter.com/grfmkuCWLD— IndianPremierLeague (@IPL) November 24, 2024