ఐపీఎల్ 2025 మెగా వేలం నిన్న (నవంబర్ 24) సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేలం తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇందులో 24 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగతా వారు భారత ఆటగాళ్లు.
తొలి రోజు వేలంలో నాలుగు ఆర్టీఎమ్ కార్డులు (రచిన్ రవీంద్ర (సీఎస్‌కే), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (ఢిల్లీ), నమన్ ధిర్ (ముంబై), అర్షదీప్ సింగ్ (పంజాబ్)) వాడుకోబడ్డాయి. నిన్న వేలంలో అన్ని ఫ్రాంచైజీలచే మొత్తం రూ. 467.85 కోట్లు ఖర్చు చేయబడింది.
నిన్నటి వేలంలో రిషబ్ పంత్‌కు అత్యధిక ధర లభించింది. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ధర. నిన్నటి వేలంలో రెండో భారీ మొత్తం శ్రేయస్ అయ్యర్‌కు లభించింది. శ్రేయస్‌ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది.
మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్‌కు లభించింది. వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్‌లను పంజాబ్ చెరి రూ. 18 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. అంతా ఊహించనట్లుగా కేఎల్ రాహుల్‌కు భారీ ధర దక్కలేదు. రాహుల్‌ను ఢిల్లీ రూ. 14 కోట్లకే సొంతం చేసుకుంది.
ఫ్రాంచైజీ వారీగా అమ్ముడుపోయిన ఆటగాళ్లు..
సీఎస్‌కే:
నూర్ అహ్మద్ (10 కోట్లు)
రవిచంద్రన్ అశ్విన్ (9.75 కోట్లు)
డెవాన్ కాన్వే (6.25 కోట్లు)
సయ్యద్ ఖలీల్ అహ్మద్ (4.8 కోట్లు)
రచిన్ రవీంద్ర (4 కోట్లు, RTM)
రాహుల్ త్రిపాఠి (3.4 కోట్లు)
విజయ్ శంకర్ (1.2 కోట్లు)
ఢిల్లీ క్యాపిటల్స్:
కేఎల్ రాహుల్ (14 కోట్లు)
మిచెల్ స్టార్క్ (11.75 కోట్లు)
టి నటరాజన్ (10.75 కోట్లు)
జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (9 కోట్లు, RTM)
హ్యారీ బ్రూక్ (6.25 కోట్లు)
అషుతోష్ శర్మ (3.80 కోట్లు)
మోహిత్ శర్మ (2.20 కోట్లు)
సమీర్ రిజ్వి (95 లక్షలు)
కరుణ్ నాయర్ (50 లక్షలు)
గుజరాత్ టైటాన్స్:
జోస్ బట్లర్ (15.75 కోట్లు)
మొహమ్మద్ సిరాజ్ (12.25 కోట్లు)
కగిసో రబాడ (10.75 కోట్లు)
ప్రసిద్ద్ కృష్ణ (9.50 కోట్లు)
మహిపాల్ లోమ్రార్ (1.70 కోట్లు)
మనవ్ సుతార్ (30 లక్షలు)
కుమార్ కుషాగ్రా (65 లక్షలు)
అనుజ్ రావత్ (30 లక్షలు)
నిషాంత్ సంధు (30 లక్షలు)
కేకేఆర్:
వెంకటేశ్ అయ్యర్ (23.75 కోట్లు)
అన్రిచ్ నోర్జే (6.50 కోట్లు)
క్వింటన్ డికాక్ (3.60 కోట్లు)
అంగ్‌క్రిష్ రఘువంశీ (3 కోట్లు)
రహ్మానుల్లా గుర్బాజ్ (2 కోట్లు)
వైభవ్ అరోరా (1.80 కోట్లు)
మయాంక్ మార్కండే (30 లక్షలు)
లక్నో సూపర్ జెయింట్స్:
రిషబ్ పంత్ (27 కోట్లు)
ఆవేశ్ ఖాన్ (9.75 కోట్లు)
డేవిడ్ మిల్లర్ (7.5 కోట్లు)
అబ్దుల్ సమద్ (4.2 కోట్లు)
మిచెల్ మార్ష్ (3.4 కోట్లు)
ఆర్యన్ జుయల్ (30 లక్షలు)
ముంబై ఇండియన్స్:
ట్రెంట్ బౌల్ట్ (12.50 కోట్లు)
నమన్ ధిర్ (5.25 కోట్లు, RTM)
రాబిన్ మింజ్ (65 లక్షలు)
కర్ణ్ శర్మ (50 లక్షలు)
పంజాబ్ కింగ్స్:
శ్రేయస్ అయ్యర్(26.75 కోట్లు)
యుజ్వేంద్ర చహల్(18 కోట్లు)
అర్షదీప్ సింగ్ (18 కోట్లు, RTM)
మార్కస్ స్టోయినిస్ (11 కోట్లు)
నేహల్ వధేరా (4.2 కోట్లు)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (4.2 కోట్లు)
విజయ్‌కుమార్ వైశాఖ్ (1.8 కోట్లు)
యశ్ ఠాకర్ (1.60 కోట్లు)
హర్ప్రీత్ బ్రార్ (1.5 కోట్లు)
విష్ణు వినోద్ (95 లక్షలు)
రాజస్థాన్ రాయల్స్:
జోఫ్రా ఆర్చర్ (12.50 కోట్లు)
వనిందు హసరంగ (5.25 కోట్లు)
మహీశ్ తీక్షణ (4.40 కోట్లు)
ఆకాశ్ మధ్వాల్ (1.20 కోట్లు)
కుమార్ కార్తీకేయ (30 లక్షలు)
ఆర్సీబీ:
జోష్ హాజిల్‌వుడ్ (12.50 కోట్లు)
ఫిల్ సాల్ట్ (11.50 కోట్లు)
జితేశ్ శర్మ (11 కోట్లు)
లియామ్ లివింగ్‌స్టోన్ (8.75 కోట్లు)
రసిఖ్ దార్ (6 కోట్లు)
సుయాశ్ శర్మ (2.6 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్:
ఇషాన్ కిషన్ (11.25 కోట్లు)
మొహమ్మద్ షమీ (10 కోట్లు)
హర్షల్ పటేల్ (8 కోట్లు)
అభినవ్ మనోహర్ (3.20కోట్లు)
రాహుల్ చాహల్ (3.20 కోట్లు)
ఆడమ్ జంపా (2.40 కోట్లు)
సిమ్రన్‌జీత్ సింగ్ (1.50 కోట్లు)
అథర్వ తైడే (30 లక్షలు)
Comments
Please login to add a commentAdd a comment