న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ జోడీల్లో సౌరవ్ గంగూలీ-సచిన్ టెండూల్కర్‌ల జంట ఒకటి. వీరిద్దరూ ఎన్నో అరుదైన రికార్డులను నెలకొల్పి ఓపెనింగ్ భాగస్వామ్యానికి వన్నె తెచ్చారు. అయితే టెండూల్కర్ ఓపెనర్‌గా సక్సెస్ అయినా తొలి బంతిని ఫేస్ చేయడానికి వెనుకాడేవాడట. అసలు స్టైకింగ్ తీసుకోవడానికి టెండూల్కర్ ఇష్టపడేవాడు కాదని తాజాగా గంగూలీ తెలిపాడు. బీసీసీఐ టీవీలో మయాంక్ అగర్వాల్‌తో చాట్ చేస్తూ అడిగిన ప్రశ్నకు గంగూలీ సమాధానమిచ్చాడు. తాను పలుమార్లు టెండూల్కర్‌ను స్ట్రైక్ తీసుకోమని అడిగినా అతని నుంచి రెండు సమాధానాలు వచ్చేవన్నాడు. సచిన్ ఫామ్‌లో ఉంటే ఒక సమాధానం.. లేకపోతే మరొక సమాధానం వచ్చేదని గంగూలీ ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేకున్నాడు.(టి20 కోసం నా బ్యాటింగ్ మార్చుకునేవాడిని)
‘సచిన్‌ను స్ట్రైకింగ్ తీసుకుంటావా అనే అడిగిన సందర్భాలు ఉన్నాయి. దానికి సచిన్ దగ్గర రెండు సమాధానాలు ఉండేవి. ఫామ్‌లో ఉంటే నేను ఫామ్‌లో ఉన్నాను కదా.. నాన్ స్టైకింగ్ ఎండ్‌లోనే ఉంటా అనేవాడు. ఒకవేళ ఫామ్ లేకపోతే నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండి ఒత్తిడిని అధిగమిస్తా అనేవాడు. ఒకవేళ అవతలి బ్యాట్స్‌మెన్ సచిన్ కన్నా వేగంగా మైదానంలోకి వెళ్లి నాన్ స్ట్రైకింగ్‌లో నిలుచుంటే తప్పా.. మనం సచిన్‌ను తొలి బంతి ఆడేలా చేయలేము. తన కెరీర్‌లో కేవలం ఒకటి-రెండు సందర్భాలలో అలా చేశా. సచిన్ కంటే ముందు వెళ్లి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో నిల్చునేవాడిని. అది టీవీల్లో కనబనడటంతో స్ట్రైకింగ్ తీసుకోమని సచిన్‌కు చెప్పేవాడిని’ అని గంగూలీ తెలిపాడు.సౌరవ్ గంగూలీ-సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున వన్డే ఓపెనింగ్ జోడీగా 136 ఇన్నింగ్స్‌ల్లో 6, 609 పరుగులు చేశారు. వరల్డ్‌లో వన్డే ఫార్మాట్‌లో ఓపెనింగ్ రికార్డు ఇదే. మరొకవైపు వారి అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం 258 పరుగులు. 2001లో కెన్యాపై దీన్ని నమోదు చేశారు. (నీ బుగ్గలు ఇష్టం.. వాటిని పట్టుకోనా?)
Comments
Please login to add a commentAdd a comment