
ఐపీఎల్- 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ యజమాన్యం సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు పంజాబ్ మయాంక్ అగర్వాల్‌తో పాటు అర్షదీప్ సింగ్‌ను రీటైన్ చేసుకుంది. అయితే మెగా వేలంలో శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్ స్టోన్, కగిసో రబడ వంటి స్టార్ ఆటగాళ్లను పంజాబ్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ధావన్‌ను కెప్టెన్‌గా నియమించనున్నారని వార్తలు వినిపించాయి. కానీ పంజాబ్ యజమాన్యం మాత్రం మయాంక్ వైపే మొగ్గు చూపింది.
ఇక 2011లో ఐపీఎల్‌లో ఢిల్లీ డెర్‌డెవిల్స్ తరుపున అరంగేట్రం చేశాడు. తర్వాత 2018 నుంచి పంజాబ్‌కు మయాంక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వేలానికి ముందు అతడిని రూ. 12 కోట్లకు పంజాబ్ రిటైన్ చేసుకుంది. పంజాబ్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత మయాంక్ స్పందించాడు. 'నేను 2018 నుంచి పంజాబ్ కింగ్స్ జట్టులో భాగమై ఉన్నాను. పంజాబ్ లాంటి ప్రతిష్టాత్మక జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. నేను ఈ బాధ్యతను అత్యంత చిత్తశుద్ధితో నిర్వరిస్తాను "అని మయాంక్ అగర్వాల్ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26న ప్రారంభం కానుంది.
చదవండి: పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేత లాహోర్.. ఆరేళ్ల తర్వాత!