KL Rahul: కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత.. గేల్‌ తర్వాతి స్థానంలో | KL Rahul 2nd Batsman After Chris Gayle Reach 3000 Runs Few Innings IPL | Sakshi
Sakshi News home page

KL Rahul: కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత.. గేల్‌ తర్వాతి స్థానంలో

Published Tue, Sep 21 2021 10:46 PM | Last Updated on Tue, Sep 21 2021 11:13 PM

KL Rahul 2nd Batsman After Chris Gayle Reach 3000 Runs Few Innings IPL - Sakshi

Courtesy: IPL Twitter

KL Rahul Reach 3000 Runs IPL..  పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా మూడు వేల పరుగులు అందుకున్న రెండో ఆటగాడిగా రాహుల్‌ నిలిచాడు. కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌లో 3వేల పరుగులు సాధించడానికి 80 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. కాగా ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ మూడో బంతికి సకారియా బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టడం ద్వారా రాహుల్‌ ఈ మార్క్‌ను అందుకున్నాడు. ఇక మయాంక్‌ అగర్వాల్‌ కూడా 3వేల పరుగుల జాబితాలో చేరిపోయాడు. ఇదే మ్యాచ్‌లో క్రిస్‌ మోరిస్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ మూడో బంతిని సిక్స్‌ బాదిన మయాంక్‌ ఐపీఎల్‌లో ఈ మార్క్‌ను చేరుకున్నాడు.

కాగా క్రిస్‌ గేల్‌ 75 ఇన్నింగ్స్‌ల్లోనే 3వేల పరుగుల మార్క్‌ను అందుకొని తొలి స్థానంలో ఉన్నాడు. ఇక డేవిడ్‌ వార్నర్‌ 94 ఇన్నింగ్స్‌ల్లో .. సురేశ్‌ రైనా 103 ఇన్నింగ్స్‌ల్లో మూడు వేల పరుగుల మార్క్‌ను అందుకున్నారు. 

చదవండి: IPL 2021: ఐదు వికెట్ల ఘనత అందుకున్న మూడో పిన్న వయస్కుడిగా


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement