IPL 2022 PBKS Vs MI: Mayank Agarwal Creates Record With 4000 Runs In T20 Cricket - Sakshi
Sakshi News home page

Mayank Agarwal: పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ అరుదైన ఫీట్‌

Published Wed, Apr 13 2022 9:12 PM | Last Updated on Thu, Apr 14 2022 9:40 AM

IPL 2022: Mayank Agarwal Reaches 4000 Runs Milestone Vs MI - Sakshi

Courtesy: IPL Twitter

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ అరుదైన ఫీట్‌ సాధించాడు. 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మయాంక్‌ టి20 క్రికెట్‌లో 4వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. మయాంక్‌ టి20ల్లో ఈ మార్క్‌ను చేరుకోవడానికి 164 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. ఇక తొలి వెయ్యి పరుగులు అందుకోవడానికి మయాంక్‌ 45 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. రెండో వెయ్యి పరుగులకు 42 ఇన్నింగ్స్‌లు.. మూడో వెయ్యి పరుగుల మార్క్‌కు 45 ఇన్నింగ్స్‌లు.. నాలుగో వెయ్యి పరుగులకు 32 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. ఇక మ్యాచ్‌లో మయాంక్‌ 52 పరుగులు చేసి ఔటయ్యాడు. ఐపీఎల్‌లో మయాంక్‌కు ఇది 12వ అర్థశతకం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement